సాధారణంగా మనకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడైతే మూలికలు లాంటివి వాడే వారేమో. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇక దగ్గు తుమ్ము జ్వరం లాంటివి వచ్చినా కూడా వైద్యులు దగ్గరికి పరుగులు పెడుతున్నారు జనాలు. అయితే ఇక కేవలం దగ్గుతుమ్ము జ్వరం లాంటివి మాత్రమే కాకుండా వివిధ వ్యాధులతో బాధపడే పేషెంట్లు కూడా డాక్టర్ల దగ్గరికి వస్తూ ఉంటారు. అందుకే ఏదైనా వ్యాధితో వచ్చిన పేషెంట్లు ఇక డాక్టర్లకు పెద్దగా కొత్తగా అనిపించరు. ఎందుకంటే ఇలాంటివి చాలానే చూసాం. ఇంకేం కొత్తగా అనిపిస్తుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏకంగా అనుభవం ఉన్న వైద్యులను సైతం ఆశ్చర్యానికి లోన్ చేసే కొన్ని కొన్ని ఘటనలు అప్పుడప్పుడు తెర మీదికి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.


 సాధారణంగా ఇంట్లో బొద్దింక ని చూస్తేనే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే కాస్త భయపడిపోతూ ఉంటారు. ఇక లేడీస్ అయితే మరింత ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు అనుకోండి. అదంతా పక్కన పెడితే ఇక బొద్దింక ఇంట్లో కనిపించింది అంటే చాలు దానిని బయటికి తరీమెందుకు అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బొద్దింక బయటికి వచ్చేసింది. హమ్మయ్య ఇంకేముంది అందరూ హాయిగా నిద్రపోవచ్చు అనుకుంటున్నారు కదా. అయితే బొద్దింక బయటికి వచ్చింది ఇంట్లో నుంచి కాదు ఏకంగా ఊపిరితిత్తుల్లో నుంచి. అదేంటి ఊపిరితిత్తుల్లో నుంచి బొద్దింక బయటకు రావడం ఏంటి.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. నిజమే ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా ఊపిరితిత్తుల్లో నుంచి ఒక బొద్దింక బయటకు వచ్చింది.


 కేరళలోని కొచ్చిలో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో 55 ఏళ్ల వ్యక్తి అమృథ్ హాస్పిటల్ కి వెళ్ళాడు. అయితే అతనికి పరీక్షలు చేసిన వైద్యులు రిపోర్టులు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అతని ఊపిరితిత్తుల్లో ఏకంగా బొద్దింక ఉంది. అతను ఊపిరి తీసుకోవడానికి కారణం ఓ బొద్దింక అని డాక్టర్లు గుర్తించారు  ఊపిరితిత్తుల్లో ఉన్న ఆ బొద్దింకను ఏకంగా బయటకు తీశారు. అయితే అతడికి గతంలోనే శ్వాస సమస్య ఉండడంతో గొంతు ద్వారా ట్యూబ్ వేసి ఉందని.. ఇక దాని ద్వారానే బొద్దింక లోపలికి వెళ్లి ఉండవచ్చని వైద్యులు భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఏదేమైనా ఇలా ఊపిరితిత్తుల నుంచి బొద్దింక బయటకు రావడం మాత్రం వైద్యులనే షాక్ కి గురి చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: