నేటి రోజుల్లో జనాలు సోషల్ మీడియాకు ఎంతలా అడిక్ట్ అయిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం మనిషి అవసరాలను మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు ఏకంగా మనిషిని బానిసగా చేసి ఆడిస్తుంది. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో అరచేతిలో ఉన్న మొబైల్ లోనే అన్ని దొరికేస్తూ ఉన్నాయి. అధునాతన  టెక్నాలజీతో కావాల్సిన వస్తువులు అన్నింటిని కూడా కూర్చున్న చోటికి తప్పించుకోగలుగుతున్నాడు మనిషి.


 ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ అంటూ ఎన్నో రకాల సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఇక సెల్ఫోన్ లోనే కొత్త ప్రపంచాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టారు. దీంతో మనిషి పక్కన ఉన్న మనుషులతో మాట్లాడటం మానేసి చాలా రోజులైంది. సోషల్ మీడియాలో ఎక్కడో ఉన్న జనాలతోనే చాటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. అయితే ఇక ఇటీవల కాలంలో అధునాతనమైన ఫీచర్లతో కూడిన మొబైల్స్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా సెల్ఫీలు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి సెల్ఫీలు కొన్ని కొన్ని సార్లు ప్రమాదాల బారిన పడేస్తూ ఉన్న.. జనాలు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది  కారులో ప్రయాణిస్తూ సెల్ఫీ వీడియో తీసుకోవాలి అనుకున్న ఒక యువతికి చివరికి చేదు అనుభవం ఎదురయింది.


 ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. కారులో ఉన్న ఒక మహిళ ఎక్కడికో ప్రయాణిస్తుంది. అయితే  తన ప్రయాణానికి సంబంధించిన సెల్ఫీలను ఫోటోలను వీడియోలను తీసుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే తన మొబైల్ ని కారు కిటికీలో నుంచి బయటకు పెట్టి సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టింది. అయితే కారు అప్పటికే ఎంతో వేగంగా ఉండడంతో.. ఇక ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఎగిరి రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు  ఒకసారిగా షాక్ లో మునిగిపోయింది. ఆ తర్వాత కారు ఆపమని అరవడం మొదలు పెట్టింది. అయితే మొబైల్ రోడ్డుపై పడిన వేగానికి దాదాపుగా ముక్కలు ముక్కలు అయ్యే ఉంటుంది. కాగా ఇక ఈ వీడియో చూసి ఇలాంటివి అవసరమా అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: