సాధారణంగా ఎంతో మంది వాహనదారులు తమ వాహనంపై తమకు ఇష్టమైన పేర్లు రాయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. రేడియం తో తమ పిల్లల పేర్లను లేదంటే తమ కుటుంబలోని తమకు ప్రియమైన వారి పేర్లను ఇక వాహనాలపై రాయించుకోవడం చూస్తూ ఉంటాం. అయితే ఇంకొంతమంది ఇలా పేర్లను కాకుండా ఏకంగా కొటేషన్స్ రాసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇలాంటి కొటేషన్స్ అయితే ఆటోల వెనకాల ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.


 అయితే కొంతమంది ఆటో డ్రైవర్లు ఇలా కొటేషన్స్ రాసుకోవడం విషయంలో కూడా కాస్త క్రియేటివిటీ చూపిస్తూ ఉంటారు. ఏకంగా సొంతంగా ఏదో ఒక కవిత రాసి.. ఆ కవితను ఆటో వెనకాల కొటేషన్ గా వేయించుకోవడం చేస్తూ ఉంటారు. ఇదేంటి ఇలా ఎందుకు రాయించుకున్నారు అంటే.. ఇది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అని చెబుతూ ఉంటారు. అయితే ఇలా ఆటో వెనకాల రాసిన చిత్ర విచిత్రమైన కొటేషన్స్ ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలానే వైరల్ గా మారిపోయాయ్. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కొటేషన్ గురించి తెలిస్తే మాత్రం తప్పకుండా సెల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకంటే ఆటోవాలా తన కొటేషన్ తో అందరి మనసులు గెలుచుకుంటున్నాడు.



 ఆటోల వెనకాల సినిమాల పేర్లు హీరోల ఫోటోలు లవ్ కొటేషన్స్ మాత్రమే చూస్తూ ఉంటాం  కానీ హైదరాబాద్ లోని ఒక ఆటోవాలా మాత్రం తన ఆటో వెనక ముద్రించిన కొటేషన్ తో అందరిని ఆలోచింపచేస్తున్నాడు. ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడ నుంచి వస్తుందని అడిగితే.. దేవుడు కురిపిస్తాడు అని చెప్పకండి.. అలా కాకుండా మనం ఒక మొక్క నాటితే ఒక చుక్క వర్షం పడుతుంది అని చెప్పండి అంటూ ఒక కొటేషన్ రాసుకున్నాడు. ఇక ఈ కొటేషన్ పక్కన చిగురిస్తున్న మొక్క బొమ్మను కూడా వేసుకున్నాడు. ఇది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేస్తుంది. ఇది కూడా నిజమే కదా. నీ కొటేషన్తో అందరిని ఆలోచింపచేసావ్ అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: