మద్యం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలుసు. ఇక ప్రతి ఒక్కరు తాగే మద్యం బాటిల్ పైన కూడా పెద్ద పెద్ద అక్షరాలతో ఇది రాసి ఉంటుంది. ఇక సినిమాకు వెళ్ళినప్పుడు కూడా మద్యం  తాగితే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి అనే విషయంపై ఎన్నో యాడ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ మద్యం అలవాటును మానుకోవాలి అనుకునే వారు మాత్రం నేటి తక్కువవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా ఎంతోమంది మందు తాగడానికి తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు.


 వెరసి మద్యం ఎన్నో కుటుంబాలని రోడ్డున పడేస్తుంది  మనిషిని బానిసగా మార్చుకుంటున్న మద్యం.. చివరికి ఎన్నో అనర్ధాలకు కూడా కారణం అవుతుంది. ఇలా మద్యం మత్తులోనే ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఇలాంటి మద్యం మత్తులోనే ఎన్నో ఇక అత్యాచారాలు కూడా జరుగుతున్నాయ్. ఇలాంటి మద్యం మత్తులోనే చివరికి మనుషులను దారుణంగా హత్యలు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ ఏకంగా మద్యం కారణంగానే ఓ తల్లి హంతకురాలిగా మారిపోయింది. మందుకు బానిసగా మారిపోయిన కొడుకు తరచూ వేధిస్తూ ఉండడంతో తల్లి భరించలేకపోయింది. దీంతో కన్న పేగు బంధాన్ని సైతం మరిచిపోయి కొడుకును హతమార్చింది.


 హైదరాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ లో చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకుని తల్లి దారుణంగా హత్య చేసింది. కామాక్షి పురానికి చెందిన మురళి మద్యానికి  బానిసగా మారిపోయాడు. తరచూ మద్యం తాగి వచ్చి తల్లిశోభ తమ్ముడు మనోహర్ ను తరచూ వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి మద్యం తాగి ఇంటికి రాగా వేధింపులు తాగలేకపోయిన తల్లి చిన్న కొడుకు చీరతో గొంతు బిగించి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: