సాధారణంగా ఏదో ఒక నేరం కింద జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కొన్ని కొన్ని సార్లు తప్పించుకోవడానికి చిత్రవిచిత్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇలా ఖైదీలు చేసే పనులు అప్పుడప్పుడు పోలీసులు సైతం అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అతను జైలు నుంచి తప్పించుకోవాలి అనుకున్నాడో లేదంటే ఇక జైలు శిక్ష అనుభవించలేక ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నాడో తెలియదు. కానీ ఒక పిచ్చి పని చేశాడు. దీంతో ఒక్కసారిగా ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు.


 ఇక అతను చేసిన పనితో పోలీసులు సైతం షాక్ అయ్యారు.ఇక వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా అతి కష్టం మీద డాక్టర్లు అతని ప్రాణాలను కాపాడారు అని చెప్పాలి. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి జైల్లో వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఇలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఇనుప మేకులను మింగి ప్రాణాలను తెచ్చుకున్నాడు. చర్లపల్లి జైలు ఖైదీ మహమ్మద్ షేక్ అనే 32 ఏళ్ల వ్యక్తి ఇనుప మేకులు మింగాడు  అది కూడా ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది ఇనుపమేకులను మింగాడు అని చెప్పాలి.


 దీంతో అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఇక అతను ఉంటున్న జైలులోనే గట్టిగా అరవడం మొదలుపెట్టాడు  ఇక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే గమనించిన పోలీసులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నాలుగు రోజులపాటు కూడా డాక్టర్లు అతనికి చికిత్స అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కడుపులో మేకులు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించి ఇక అతని కడుపులో ఉన్న తొమ్మిది ఇనుప మైకులను బయటకు తీశారు వైద్యులు. దీంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: