ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ప్రాణం ఎప్పుడూ ఎలా పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కొంతమంది విషయంలో విధి కక్ష కట్టినట్టుగానే వ్యవహరిస్తూ ఉంటుంది. దీంతో సాఫిగా సాగిపోతున్న జీవితాన్ని అర్థంతరంగా ముగిస్తూ ఉంటుంది విధి. దీంతో ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.


 అయితే ఇలా కూడా మనిషి ప్రాణం పోతుంది అని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే సాధారణంగా ఇటీవల కాలంలో ఏ శుభకార్యానికి అయినా సరే తమకు ఇష్టమైన కేక్ తెచ్చుకొని కేక్ కట్ చేసి ఇక సెలబ్రేషన్స్ చేసుకోవడం చూస్తూ ఉన్నాం. ఇక పుట్టినరోజుకు అయితే ప్రతి ఒక్కరూ కేక్ కట్ చేయకుండా అస్సలు ఉండలేరు. అయితే ఇక్కడ మాత్రం ఇలా పుట్టినరోజు నాడు కట్ చేయడమే బాలిక పాలిట శాపం గా మారింది. పుట్టినరోజు నాడు కట్ చేసిన కేక్ తిని బాలిక మృతి చెందింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంక్షేమంగా మారిపోయింది. అయితే ఇలా బర్త్ డే కేక్ తిని చనిపోవడమేంటి.. ఈ మరణం వెనక ఏదో జరిగే ఉంటుంది అనే ఇక పోలీసులు సైతం అనుమానించారు. ఈ క్రమంలోనే ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాళ్లు తెచ్చుకున్న కేకులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ సాచ నైర్ అధిక మోతాదులో వాడినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ ఆహారం, పానీయాలలో ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ కేక్ లో ఇది ఎక్కువగా వాడడంతో అది తిన్నవారందరూ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే  బేకరీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: