ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఎన్నో వింతైన ఘటనలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంది. ఎన్నో వింతైన ఘటనలు ప్రతిరోజు వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రిజల్ట్ ఫీవర్ కొనసాగుతోంది. వివిధ పరీక్షలకు సంబంధించిన ఫలితాల విడుదలవుతూ ఉండడంతో.. అటు విద్యార్థులు అందరూ కూడా టెన్షన్ లో మునిగిపోతున్నారు. పరీక్షల ఫలితాల నేపథ్యంలో కొన్ని కొన్ని చోట్ల విషాదకర ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి.



 పరీక్షల్లో అనుకున్న రీతిలో మార్కులు రాలేదని తక్కువ మార్కులు వచ్చాయని ఎంతో మంది విద్యార్థులు బాధపడిపోతున్నారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా పరీక్షల్లో పాస్ కాలేకపోయాము అనే బాధతో ఎంతోమంది విద్యార్థులు కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. ఏకంగా ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి  ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు చూసుకుంటూ ఇలా చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఎంతమంది విద్యార్థులు. కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.



 అతనికి ఊహించని రీతిలో భారీగా మార్కులు వచ్చాయి. ఏకంగా 100%కి 93.5% మార్కులు సంపాదించింది. ఇంకేముంది ఎన్ని మార్కులు వచ్చిన తర్వాత సంతోషంలో ఎగిరి గంతేసి ఉంటాడు అనుకుంటున్నారు కదా.  అయితే ఇన్ని మార్కులు వచ్చాయి అనే ఆనందంలో ఏకంగా విద్యార్థి మూర్చపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో వెలుగులోకి వచ్చింది. స్టూడెంట్ కి ఎక్కువ మార్కులు వచ్చిన కారణంగా వింత అనుభవం ఎదురయింది. యూపీ ఎస్ఎస్సి బోర్డు విడుదల చేసిన ఫలితాలలో టెన్త్ విద్యార్థి అన్షుల్ కుమార్ కు 93.5% మార్కులు వచ్చాయి. అయితే తనకు ఊహించిన దాని కంటే ఎక్కువ మార్కులు రావడంతో అతనికి మూర్చ వచ్చింది. దీంతో అతన్ని ఐసీయూలో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icu