సాధారణంగా వైద్యులను కలియుగ దైవం అని అంటూ ఉంటారు. ఎందుకంటే నేటి రోజుల్లో గుడికి వెళ్లి మొక్కితే దేవుడు వరాలు ఇస్తాడో లేదో తెలియదు. కానీ ఆసుపత్రికి వెళ్తే మాత్రం వైద్యులు తప్పకుండా పునర్జన్మను ప్రసాదిస్తారు అని అందరూ చెబుతూ ఉంటారు. కరోనా వైరస్ లాంటి కష్ట కాలంలో వైద్యులు జనాల ప్రాణాలను కాపాడేందుకు పోరాటం సాగించిన తీరు.. ప్రతి ఒక్కరిలో కూడా వైద్య వృత్తిపై గౌరవాన్ని మరింత పెంచింది. దీంతో అడిగితే కాదు అడగకపోయినా వరాలు ఇచ్చే కలియుగ దైవం తెల్లకోటు వేసుకున్న వైద్యుడు అని చెబుతూ ఉంటారు ఎంతోమంది.


 ఇలా వైద్య వృత్తిపై ప్రతి ఒకరికి కూడా ఎంతో గౌరవం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏకంగా వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా కొంతమంది డాక్టర్ల ప్రవర్తన తీరు ఉంటుంది. ఏకంగా ప్రాణాపాయ స్థితిలో తమ దగ్గరికి వచ్చిన పేషంట్ల విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ చివరికి పేషంట్ల ప్రాణాల మీదికి తెస్తూ ఉంటారు. ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. సాధారణంగా ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గురించి.. ఇప్పటివరకు విన్నాం. కానీ ఇది మరింత విచిత్రమైనది. ఎందుకంటే చేతికి ఆపరేషన్ కోసం వెళ్ళిన ఒక బాలికకు చివరికి నాలుకకు ఆపరేషన్ చేశారు వైద్యులు.


 కేరళలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వైద్యులు నిర్లక్ష్యంతో చేతికి చేయాల్సిన సర్జరీని నాలుగకు చేయడంతో.. కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. చేతికి ఉన్న ఆరోవేలు తొలగింపు కోసం నాలుగేళ్ల  చిన్నారిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే సర్జరీ పూర్తయిన తర్వాత చిన్నారి నోటికి ప్లాస్టర్ వేసి ఉండడం చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటి అని వైద్యులను ప్రశ్నిస్తే.. మరో పాపకు చేయాల్సిన సర్జరీ ఈ చిన్నారికి చేసామని పొరపాటు జరిగింది అంటూ వైద్యులు ఒప్పుకున్నారు. దీంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి విచారణకు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: