సాధారణంగా వివాహవేదిక అంటే ఎలా ఉంటుంది. భాజా భజంత్రీల చప్పుళ్లు, కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం అనే సంతోషంలో వధువు వరుడి ముఖంలో చిరునవ్వులు. ఇకబంధుమిత్రుల హడావిడి.. పురోహితుడి వేదమంత్రాలు.. ఇలా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక ప్రతి ఒక్కరు కూడా తమ పెళ్లి వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండేందుకు ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ వరుడు ఇలాగే చేయబోయాడు. ఏకంగా పెళ్లి వేదికపైనే వధువుకు ముద్దు పెట్టాడు. ఇంకేముంది పెళ్లి హడావిడి ఉండాల్సిన మండపం కాస్త రణరంగంగా మారిపోయింది.


 వరుడు చేసిన ఒక చిలిపి పని చివరికి పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఏకంగా వధువు వరుడు కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకునే పరిస్థితికి కారణమైంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని హావూరులో వెలుగులోకి వచ్చింది. ఓ పెళ్లి వేడుకలో వధువు తరుపు వారు వరుడుని కొట్టడమే కాకుండా పెళ్లికి వచ్చిన అతిథులను కూడా దారుణంగా కొట్టారు. దీంతో వరుడు తరుపు వారు కూడా అటువైపు ఉన్న వారిపై రాళ్లూ రూవ్వారు. ఇలా కల్యాణ వేదిక కాస్త రణరంగంగా మారిపోయింది. ఈ ఘర్షణలో అరడజనుకు పైగా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని చివరికి పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు.


 ఇంత జరగడానికి కారణం ఏంటి అంటారా.. వరుడు చేసిన ఒక చిలిపి పని. దీనికి కారణం జయమాల సమయంలో వరుడు అందరి ముందు వేదికపై వధువుకు ముద్దు పెట్టాడు. వరుడు చేసిన ఈ పనికి వధువు తరుపు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి కొడుకు తో సహా పెళ్లికి వచ్చిన వారితో వాగ్వివాదం జరిగింది. ఇక కాసేపటికి మాటల యుద్ధం కాస్త చేతల యుద్ధంగా మారిపోయి.. బీకర ఘర్షణ మొదలైంది. ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకున్నారు. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఏడుగురుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: