మత గురువులు, స్వామీజీల ముసుగులో కొంతమంది కామాంధులు కన్నెపిల్లలను కాటు వేస్తున్నారు. తాజాగా ఒక మత గురువు నిజ స్వరూపం బయటపడింది. ఈ నీచుడు ఒక మైనర్ కు దెయ్యం పట్టిందని, అది వదలాలంటే సెక్స్ చేయాలని మాయ మాటలు చెప్పాడు. అనంతరం ఆ బాలికపై అత్యాచారం చేశాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు ఆ బాలికను ఆరు నెలలుగా తరచూ రేప్ చేస్తూ వస్తున్నాడు. చివరికి బాలిక తల్లిదండ్రులకు మత గురువు చేస్తున్న తప్పుడు పని తెలిసింది. దాంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. అభం శుభం తెలియని తమ కూతురు జీవితం అన్యాయం చేసిన ఆ మత గురువుపై పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. అలా అతడి పాపం పడింది. ఈ సంచలన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే, కర్ణాటక రాష్ట్రం, చిత్రదుర్గ సిటీలోని ఓ మసీదులో ఓ మతగురువు నివాసం ఉంటున్నాడు. ఇతడు మసీదుకు సమీపంలో నివసిస్తున్న ఓ బాలికకు గత మూడేళ్లుగా ఖురాన్ బోధిస్తున్నాడు. ఈ క్రమంలో ఒకానొక సమయంలో బాలిక అనారోగ్యం పాలయ్యింది. ఆమెకు జబ్బు చేసిందని తెలుసుకున్నాక మతగురువు దెయ్యం పట్టింది అని వారిని నమ్మించడం స్టార్ట్ చేశాడు. వంకర బుద్దితో ఆ అమ్మాయికి పట్టిన దెయ్యం వదిలించాలంటే.. శృంగారమే మార్గమని చెప్పాడు. ఆమె సోదరుడికి కూడా ఈ విషయం చెప్పి సదరు బాలికను శారీరకంగా వాడుకోవడం ప్రారంభించాడు. తన పశువాంఛను తీర్చుకుంటూనే ఆ దృశ్యాలు ఫోన్‌లో రికార్డు చేశాడు.

ఆపై ఫోన్ రికార్డులు చూపించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరేడు నెలలు రాక్షసుడిలా ఆమెపై లైంగిక కోరికలు తీర్చుకున్నాడు. అయితే ఓ రోజున అమ్మాయి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా ఆమెపై లైంగిక దాడులు జరుగుతున్నట్లు డాక్టర్లు తెలుసుకున్నారు అదే విషయం తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో పేరెంట్స్‌కు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు ఫైల్ చేసి ఈ మతగురువును కటకటాల వెనక్కి నెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: