జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు, కథనాలు వండి వార్చాలి. కానీ ఏమి రాయాలనేదే అర్ధం కావటం లేదు. అందుకనే ఇల్లాజికల్ వార్తలు, కథనాలు అడ్డదిడ్డంగా రాసేస్తోంది ఎల్లోమీడియా.  మంగళవారం  ఫ్రంట్ పేజీలో వచ్చిన ’రాష్ట్రానికి ఆ హక్కుందా’ అనే హెడ్డింగ్ తో అచ్చయిన కథనం చూస్తేనే తెలిసిపోతోంది ఎంత డొల్లగా ఉందో. రాష్ట్రప్రభుత్వం నుండి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు చేరిన ’పాలనా వికేంద్రీకరణ అంటే మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు’లపై సంతకం కావాల్సుంది. ఈ బిల్లులపై గవర్నర్ సంతకాలు చేసేస్తే పాలనా వికేంద్రీకరణ మొదలైపోవటం ఖాయం. ఇక్కడే చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాకు సమస్యలు మొదలయ్యాయి. ఎలాగైనా సరే రాజధాని తరలింపు ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సిపిఐ కార్యదర్శి రామకృష్ణతో పాటు ఎల్లోమీడియా చేయని ప్రయత్నం లేదు.

 

ఇందులో భాగంగానే సోమవారం ఈనాడు దినపత్రికలో ఓ పిచ్చి కథనం అచ్చయ్యింది. వైజాగ్ లో సముద్రంగర్భంలో చీలిక వచ్చిందని,  మొత్తం విశాఖపట్నానికే ముప్పు పొంచి ఉందంటూ ఓ కథనం అచ్చేసింది. ఆ ప్రమాదమేదో రాజధానిగా వైజాగ్ ను జగన్ ఎంపిక చేసినప్పటి నుండే మొదలైనట్లు పత్రిక ఆందోళన వ్యక్తం చేసింది. జగన్ మీద గుడ్డి వ్యతిరేకత ఒకవైపు చంద్రబాబు మీద ’కమ్మ’ని ప్రేమ మరోవైపు ఉన్న కారణంగా తాము రాస్తున్న వార్తలు, కథనాలు ఎంత డొల్లగా ఉంటున్నాయో కూడా ఎల్లోమీడియా అర్ధం చేసుకోవటం లేదు.

 

తాజాగా గవర్నర్ విషయంలో రాసిన పిచ్చి కథనం కూడా ఇలాంటిదే. ఇంతకీ గవర్నర్ సందేహం ఏమిటంటే అసలు ’పాలనా వికేంద్రీకరణ...సిఆర్డీఏ చట్టం రద్దు అన్నది అసలు రాష్ట్రప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయా’ అని.  చట్టాలు చేసిన రాష్ట్రప్రభుత్వానికి వాటిని రద్దు చేసే అధికారం లేదా అన్నదే మౌళికమైన ప్రశ్న. పై రెండు చట్టాలను చేసింది రాష్ట్రప్రభుత్వమే కాబట్టి వాటిని రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రప్రభుత్వానికి ఉంటుందనటంలో ఎవరికీ సందేహం అవసరమే లేదు.  సందేహమే అవసరం లేని బిల్లుల విషయంలో కూడా గవర్నర్ కు న్యాయసందేహం వచ్చిందని  ఎల్లోమీడియా రాసిందంటే ఏమనర్ధం ? పైగా తన సందేహాలపై న్యాయసలహా కోరుతూ గవర్నర్ ఆ ఫైల్ ను న్యాయ విభాగానికి పంపారట.

 

పైగా గతంలో పార్లమెంటు ఆమోదించిన  రాష్ట్ర విభజన చట్టంలో కూడా  ఒక రాజధాని అని ఉన్నదే కానీ మూడు రాజధానుల ప్రస్తావన లేదంటూ ఎల్లోమీడియా పెద్ద లాపాయింట్ గుర్తు చేసింది. రాష్ట్ర విభజన చట్టంలోనే హైదరాబాద్ ను తెలుగు  రాష్ట్రాలకు పదేళ్ళ ఉమ్మడి రాజధాని అనుంది. మరి ఏడాదికే చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ ను వదిలి విజయవాడకు ఎందుకు పారిపోయొచ్చాడు ?  రాజధాని పై కేంద్రం నిర్మించిన శివరామకృష్ణన్ కమిటి గుంటూరు-కృష్ణ జిల్లాల మధ్య అసలు రాజధానే వద్దని చెబితే చంద్రబాబు అక్కడే రాజధానిని ఎలా ఏర్పాటు చేశాడు ? ఈ ప్రశ్నలకు ఎల్లోమీడియా సమాధానం చెబుతుందా ? పైగా శివరామకృష్ణన్ కమిటి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న సూచనకు అనుగుణంగానే కదా జగన్ వికేంద్రీకరణ చేస్తానంటున్నది. కాబట్టి ఏదో వ్యతిరేకంగా రాయాలన్నా ఉద్దేశ్యంతో రాస్తున్న రాతలే కానీ అందులో లాజిక్ ఉండదని మరోసారి అర్ధమైపోయింది.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: