అసలు తెలంగాణకు హోంమంత్రి అంటూ ఒకరు ఉన్నారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తోంది బీజేపీ.. గత వారం రోజులుగా హైదరాబాద్, ఆదిలాబాద్‌లో బయటకు వచ్చిన అనేక అంశాలను పరిశీలిస్తే.. అసలు తెలంగాణలో రాష్ట్ర హోం మంత్రి అన్నారా అన్న అనుమానం వస్తోందని..
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయుధాల అక్రమ రవాణా గుట్టు రట్టు చేయడం జరిగిందని.. రైల్వే స్టేషన్లు, ఇతర ప్రదేశాల్లో బాంబులు పెట్టిన వాళ్లు హైదరాబాద్ లో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు.


తెలంగాణలో ప్రతి వారం డ్రగ్స్ సరఫరా, నిల్వలు బయట పడుతున్నాయని.. అలాంటప్పడు రాష్ట్ర పోలీసులు ఎందుకు నిల్వరించలేకపోతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా ఏమీ జరిగిన దానికి సంబంధించిన మూలాలు తెలంగాణతో ముడిపడి ఉన్నాయని.. తెరాస, మజ్లీస్ స్నేహం వల్ల అనేక అసాంఘిక శక్తులకు అడ్డగా మారిపోయిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు.


అసలు తెలంగాణకు హోంశాఖ మంత్రి ఉన్నారా?.. మే 14న రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రాబోతుంది అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఊరిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ చరిత్రను సృష్టించబోతుందని.. ఎనిమిదేళ్ల తెరాస పాలనలో కేసీఆర్ ప్రజలను వంచించారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని విపక్షాలు అంటున్నాయి.


అయితే.. బహిరంగ సభా వేదికగా కేసీఆర్ ను రైతు, యువజన, దళిత ద్రోహిగా నిలబెట్టపోతున్నామని.. సకల జనులు తెరాస సర్కార్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని.. ధనిక రాష్ట్రంలో ప్రజల ఆస్తులను ప్రభుత్వం అమ్ముకుంటూ పోతుందని.. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్  విమర్శించారు. ప్రజా ద్రోహి కేసీఆర్ గద్దె దిగాలని.. కేసీఆర్ ఎన్నికలకు ఎప్పుడూ వెళ్లిన భాజపా సిద్ధంగా ఉంటుందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: