మనకి  సేవింగ్స్ బ్యాంక్  అంటే ఎప్పటి నుంచో కిడ్డీ బ్యాంకే..  ఆ తరువాతే పోస్ట్ ఆఫీస్ ఖాతాలు, బ్యాంకు ఖాతాలు అనేవి. దాదాపుగా పీవీ నరసింహారావు ప్రపంచీకరణ అనే పదాన్ని పాపులర్ చేసారు. డబ్బులు ఎక్కువ దాచుకుంటూ ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడవదు . డబ్బు ఒక చోటే ఉండిపోకుండా  రొటేషన్ అవుతూ ఉండాలి. అదే ప్రపంచీకరణ అంటే. దాని కోసం ఆ మధ్య  వడ్డీ రేట్లను గతంలో కన్నా బాగా తగ్గించేశారు. దాంతో జనాలు వ్యాపారాల మీద  పెట్టుబడులు పెట్టడం ఇలా రకరకాలుగా వారి డబ్బును రొటేట్ చేసేవారు.


అయితే తాజాగా మోడీ ప్రభుత్వం చిన్న మొత్తాల్లో పొదుపు చేసే వారికి  శుభవార్తను చెప్పింది. బ్యాంకు డిపాజిట్లు రుణ పత్రాలపై వడ్డీ రేట్లు పెరగడంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023 మార్చితో ముగిసే త్రైమాసిక ‌సంవత్సరానికి పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం, నేషనల్  సేవింగ్స్ సర్టిఫికెట్ లాంటి చిన్న  మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 1.1 శాతం పెంచింది.


ఈ సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం, ఎస్ఎస్పీ సర్టిఫికెట్ పై ఉన్న వడ్డీ రేట్లు 6.8% నుంచి 7%కి పెంచారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం అయితే 7.6శాతం నుంచి 8 శాతానికి పెరుగుతుంది. ఏడాది నుంచి ఐదేళ్ల పాటు కాల పరిమితి ఉండే పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ పై అయితే వడ్డీ 1.1శాతం పెంచారు. పోస్ట్ ఆఫీస్ నెలవారి ఆదాయ పథకం పై చెల్లించే వడ్డీ 6.7% నుంచి 7.1%కి పెంచారు. కిసాన్ వికాస్ పత్ర గడువులు 123 నెలల నుంచి 120 నెలలకు కుదించారు. ఈ పథకంపై చెల్లించే వడ్డీ రేటు 7శాతం నుంచి 7.2 శాతానికి పెంచారు.


అత్యంత ప్రజాదరణ పొందిన పి పి ఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్), సుకన్య సమృద్ధి యోజన పథకాలపై మాత్రం వడ్డీ రేట్లు సాధారణంగా  7.1% ఎప్పటిలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: