
నల్లచట్టాలతో రైతులు ఉసురు పోసుకున్న పార్టీకి తెలంగాణ రైతులు బుద్ధిచెబుతారని... మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రపంచంలో నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తున్న ఏకైక పథకం రైతు బంధు .. ఇప్పటి వరకు రూ.65 వేల కోట్లు జమ చేశారని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలు, అంబలికేంద్రాల తెలంగాణ నేడు పక్క రాష్ట్రాలకు బియ్యం ఇచ్చే స్థాయికి ఎదిగిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నల్లచట్టాలతో రైతులు ఉసురు పోసుకున్న పార్టీ తెలంగాణ రైతులు వ్యవసాయ కల్లాలు నిర్మించుకుంటే పైసలు వెనక్కు ఇవ్వమంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
బోరుబావులకు మీటర్లు పెట్టనందుకు కేంద్రం రూ.30 వేల కోట్లను నిలిపివేసిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతి గింజ ప్రభుత్వం మద్దతుధరకు కొనుగోలు చేస్తున్నదని... పంట పొలాలను కాల్చకుండా, కేజీ వీల్స్ తో రైతులు ట్రాక్టర్లతో రోడ్ల మీదకు రాకుండా, కెమికల్ ఫర్టిలైజర్ తగ్గించేలా, సేంద్రీయ వ్యవసాయం పెంచేలా, పాడి, పశుసంపద పెంచేలా, ఆయిల్ పామ్ ప్రోత్సహించేలా వ్యవసాయ అధికారులు కృషిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మంత్రి కోరారు.
మొత్తానికి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటడటంతో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జోరుగా నోటిఫికేషన్లు వేస్తున్న సర్కారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపైనా దృష్టి సారించిందని చెప్పొచ్చు.