పాకిస్తాన్ లో కొన్ని ప్రాంతాలను తాలిబాన్లు కబ్జా చేశారా? అలానే అనిపిస్తోంది. ఎందుకు ఇలాంటి సందేహం వస్తోందంటే. ఇస్లామాబాద్ నుంచి ఇండియాలోని ఏదైనా ప్రాంతానికి పన్ను కట్టాలని వస్తే మనమెందుకు కడతాం. లేదా పూర్వ కాలంలో కప్పం కట్టించుకుని బానిస లేదా సామంత రాజులుగా పిలుచుకునేవారు. అలాంటి పరిస్థితినే పాకిస్థాన్ ఎదుర్కొంటుందా.. వాస్తవాలను గమనిస్తే అలాంటి స్థితిలో దాయాది దేశం ఉందనిపిస్తోంది.


తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అనే వారు పాకిస్థాన్ లోని ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారనేది వెలుగులోకి వచ్చిన వచ్చిన విషయం. ఇలా జరుగుతుందంటే అక్కడ పాకిస్థాన్ ప్రభుత్వం పని చేయడం లేదా? పాక్ సైన్యం ఏం చేస్తోంది. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఏం చేస్తోంది. పాక్ సరిహద్దు ప్రాంతంలో ప్రజలు పన్నులు కట్టడం మానేశారు. దీనిపై పాక్ ప్రభుత్వం విచారణ చేపడితే అసలు నిజాలు బయటకు వచ్చాయి. అక్కడ పాక్ అధికారులు కూడా చేతులెత్తేసిన వైనం..  పాకిస్థాన్ కాకుండా తాలిబాన్లు అక్కడ పన్నులు వసూలు చేస్తున్నారని తెలుసుకొని పాక్ ప్రభుత్వం అవాక్కయింది.


దీంతో ఆ సరిహద్దు ప్రాంతంలో దాడులు చేయాలని పాక్ సైనికాధికారులకు చెప్పింది. దీంతో దాడులు చేయడానికి వెళ్లిన పాక్ సైనికుల్లో ఒకరు మరణించారు. ఎలాగంటే తాలిబాన్లు తిరిగి దాడి చేయడంతో పరస్పర దాడులు జరిగాయి. దీంతో ఆ దాడుల్లో పాక్ సైనికుడు మరణించాడు. కాబట్టి పాకిస్థాన్ సరిహద్దుల్లో నిజంగా తాలిబాన్లు చాలా దృడంగా మారిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ కంటే తాలిబాన్ల బలం ఎక్కువగా ఉంది.


ఒక దేశంలో వేరే దేశానికి చెందిన వారు పన్నులు వసూలు చేస్తున్నారంటే ఆ దేశ సామర్థ్యం తగ్గిపోయి ఉండాలా.. లేక వారి సార్వభౌమత్వానికి తాలిబాన్లు అడ్డుపడుతున్నట్లే లెక్క.. ఏదైమైనా పాక్ లో ప్రభుత్వం ఉండి కూడా లేని పరిస్థితి తలెత్తిన సమయమిది. మరి పాక్, ఆప్గాన్ సరిహద్ధుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: