పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ తాను రాజీనామా చేయడమే కాకుండా మరొక 60మంది ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాడు. గతంలో పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో 25 మంది ఎమ్మెల్యేల తో కూడిన పార్టీలు బయటకు వచ్చి షాభా షరీఫ్ ప్రభుత్వానికి మద్దతునిచ్చాయి. దానికి కారణం సౌదీ అరేబియా మాదిరిగానే, అరబ్ కంట్రీలను చీల్చాలని ఇమ్రాన్ ఖాన్ చూడడమే.


అరబ్ కంట్రీలపై ఆధిపత్యం చేయాలని ఇమ్రాన్ ఖాన్ అనుకోవడంతో, వాళ్ళు డబ్బులతో ఆ ఎమ్మెల్యేలను కొనేసరికి వారందరూ బయటకు వచ్చి షాభా షరీఫ్ ప్రభుత్వంలో చేరారు. అరబ్ కంట్రీలు తెర వెనుక చేసిన ఈ ప్రయత్నంతో, అనుకోని విధంగా షాభా షరీఫ్, ఇంకా బిలావర్ భుట్టోలు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరిచే పరిస్థితి వచ్చింది. ఇంత జరిగాక ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కి బుద్ధి వచ్చింది ఎలక్షన్ కోసం అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టాడు, ఉద్యమాలు జరిపించాడు. చివరికి తనపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని కూడా తనపై సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇతని ఉద్యమాలను అడ్డంపెట్టుకుని, ఇతనిని బహిష్కరించడానికి ప్రయత్నించారు అక్కడ జనం. వీరితో పాటు సైన్యము ఇంకా ఐఎస్ఐ కూడా సిద్ధపడ్డాయి.


ఎన్నికల గొడవ పక్కనపెట్టి  పేపర్ స్టేట్మెంట్లు, మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ గడిపేస్తున్న ఇమ్రాన్ ఖాన్ పై రాజీనామా చేసిన మంత్రులందరూ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇమ్రాన్ ఖాన్ వల్లే వాళ్ళందరూ రాజీనామా చేసామని ఇప్పుడు పార్లమెంటు నుండి పచ్చి బూతులు తిట్టించుకుంటున్నామని వాళ్లు వాపోతున్నారు. తమ రాజీనామాలను ఉపసంహరించుకుంటామని అక్కడ స్పీకర్ కు మంత్రులందరూ లేఖ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన 45 మంది మంత్రులు తమ రాజీనామాలను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటన ఇచ్చారు. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి  ఇమ్రాన్ ఖాన్ ది. అధికారం ఉంది కదా అని అందరి మీద చూపిస్తే అలానే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: