లోకేష్ పాదయాత్ర 100 కిలోమీటర్లు దాటింది. లోకేష్ పాదయాత్రను టీడీపీ లైట్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమన్నది త్వరలోనే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కళ్లు తెరిచినట్లుంది.  ఈయన పాదయాత్రకు తగినంత మందిని పార్టీ నాయకులు, నాయకత్వం సరిగా సమకూర్చలేకపోతుందన్నది వినిపిస్తున్న వాదన. ప్రస్తుతానికి లోకేష్ పాదయాత్రకు పబ్లిక్ బాగానే వచ్చారు. కానీ రోజు ఇదే స్థాయిలో జనసమీకరణ అనేది లేదన్నది కళ్లు ముందు కనిపిస్తున్న వాస్తవం. దీంతో లోకేషే స్వయంగా సెల్పీలు తీసుకుని జనం వస్తున్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


జనం ఎక్కువగా రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీంతో జనాలను చూసి మైమరిచిపోయిన యువనేత అక్కడ వాహనం పైకెక్కి మైక్ అందుకుని మాట్లాడారు. కానీ అనుమతి లేకుండా ఎలా మాట్లాడతారని ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అక్కడ పర్మిషన్ లేని వాహనాలు రావడంతో పోలీసులు అనుమతించని వైనం. దీనిపై కొంతసేపు లోకేష్ కూడా వాగ్వివాదం చేశారు.


మొత్తం మీద చూస్తే  జనసమీకరణ అన్నది పెరుగుతోందన్నది మాత్రం నిజం. అయితే ఇదంతా ఒక వైపు మాత్రమే నిన్నజరిగిన లోకేష్ పాదయాత్రలో జనం లేరని అటు నుంచి ఓ ప్రైవేటు వాహనం లో వెళుతున్న వారు ఫోటోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో వైైరల్ చేశారు. దీంతో ఇది హట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు కుమారుడు, టీడీపీ ముఖ్య నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడితే కనీస పబ్లిక్ రాకపోవడం అనేది విచిత్రమైన విషయమే.


దీన్ని వైరల్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గ్రహించిన టీడీపీ వారు అలాంటిదేమీ లేదని గ్రహించి యువగళం పాదయాత్రకు వస్తున్న జనాలతో కూడిన ఫోటోలను, వీడియోలను టీడీపీ బయటకు తీసుకు వచ్చింది. లోకేష్ పాదయాత్రపై చేస్తున్న విమర్శలకు టీడీపీ మునుముందు మరెన్ని సవాళ్లను అధిగమించాల్సి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: