సర్వే అంటేనే షాంపిళ్లు  తీసుకోవాలి. ఒక్కో నియోజకవర్గంలో 1000, లేదా 2000 మంది అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ కేవలం తన అంచనాలనే సర్వే గా ఇస్తున్నారని తెలిసింది. మున్సిపాల్ ఎన్నికల్లో, నాలుగు రాష్ట్రాల ఎన్నికలు, బై పోల్స్, సాధారణ ఎన్నికలు ఇలా అన్ని చోట్ల ఆత్మసాక్షి మూర్తి చేసిన సర్వే లు తప్పుగా వచ్చాయి.


పత్రికల్లో వచ్చిన కథనాలు, వివరాలతో అంచనాలు వేసి వాటిని సర్వేలుగా రాసుకుంటూ వస్తారు. ప్రతిసారి అంచనాలు నిజం కావు. మిగతా రాష్ట్రాల్లో చేసిన సర్వేలు విఫలమయ్యాయి. ఆత్మసాక్షి ప్రస్తుతం తాజాగా ఒక సర్వేను బయటపెట్టారు. ఆంధ్రాలో ఎన్నికలు వస్తే టీడీపీ ఓంటరిగా పోటీచేస్తే 87 సీట్లు, జనసేనకు 6 నుంచి 7 సీట్లలో గెలుపొందుతుందని, వైసీపీకి 63 నుంచి 72 స్థానాలు వస్తాయన్నారు.


తెలుగుదేశం,జనసేన, లెప్ట్ పార్టీలు కలిస్తే 120 సీట్లు వస్తాయని చెప్పింది. టీడీపీ, జనసేన అయితే 110 వస్తాయని, టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే ఓడిపోతాయని అన్నారు.  ఆత్మసాక్షి మూర్తి కొంచెం వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి, ఈయనకు బీజేపీ అంటే పడదు. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా సర్వేలు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుంది 35 స్థానాల కంటే ఎక్కువ రావని అన్నారు. కానీ ఓంటరిగానే బీజేపీ అక్కడ గెలుపొందింది. అదే సందర్బంలో నాలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని అన్నారు.


దీనికి కారణాలు ధరల పెరుగుదల, ముస్లింల వ్యతిరేకత, రైతుల ధర్నా అంటూ చాలా వరకు కారణాలు చెప్పారు. ఇవేవీ నిజం కాలేదు. అయితే ఆంధ్రాలో ఎన్నికల సర్వే ప్రకారం కేవలం బీజేపీ కలిస్తే ఓడిపోతారని టీడీపీ, జనసేన కలిస్తే గెలుస్తారని చెప్పడం ఆయన మ్యానరిజాన్ని చూపించడమే. సర్వే అంటే ప్రజల్లోంచి రావాలి. వారి అభిప్రాయాలు కచ్చితంగా సర్వేలో కనిపించాలి. గెలుపు ఎవరిదో.. ఓటమెవరితో చూపించగలగాలి. అలాంటి సర్వేలకే ప్రజల్లో ప్రాధాన్యం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: