
అమెరికా సైతం తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఆస్ట్రేలియా తో ఒప్పందానికి చర్యలు తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా చైనా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు తన ఆధిపత్యాన్ని చాటేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇది అమెరికాకు నచ్చదు కాబట్టి అమెరికా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు ప్రస్తుతం క్వాడ్ అనే ఒక విధానాన్ని రూపొందించి అందులో ఆస్ట్రేలియాను భాగస్వామిగా మార్చింది. దీనివల్ల ప్రస్తుతం అమెరికా నుంచి సబ్ మెరైన్ స్ కొనుక్కోవలసిన పరిస్థితి ఆస్ట్రేలియాకు వచ్చింది. చైనా ఎత్తుగడలను చైనా పసిఫిక్ మహాసముద్రంలో చేస్తున్న దుశ్చర్యలను అడ్డుకోవాలంటే అమెరికా ఇలాంటి ప్రయత్నాలు చేయక తప్పదు.
ప్రపంచం మొత్తం మీద అమెరికా చైనా రెండు దేశాలే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక దేశం కంటే ఒక దేశం ఎక్కువగా విపరీత పోకడలతో ప్రపంచానికి ముప్పు తెచ్చేలా కనిపిస్తున్నా యి. ప్రస్తుతం సబ్ మెరైన్స్ చేరికలతోఆస్ట్రేలియా రక్షణ విభాగం బలంగా తయారవుతుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గతంలో అమెరికా అధ్యక్షుడుతో భేటీ అయిన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా చైనా లు రెండు వేరు వేరు దేశాలకు ఆయుధాలను సరఫరా చేస్తూ వేరువేరు ప్రాంతాల్లో తమ ఆధిపత్యం కనపరచాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. భవిష్యత్తులో ప్రపంచంలో అమెరికా వర్గం, చైనా వర్గం తయారై వివిధ దేశాలపై మరింత ఒత్తిడి తెస్తాయనడంలో సందేహం లేదు.