ఇప్పుడు దేశాలన్నిటికీ కూడా యుద్ధం అంటే  సరదాగా ఆడుకునే ఆటలా మారిపోయింది అని అనిపిస్తుంది. ఇలా అమెరికా పద్ధతిని జర్మనీ కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్యనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ యువరాజు గురించి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇప్పుడు అదే అమెరికా తరహాలోనే జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి  చైనాకు వెళ్లి చైనా కు వ్యతిరేకంగా మాట్లాడారు. చైనా చేస్తున్నటువంటి పద్ధతి కరెక్ట్ గా లేదని మీరు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ చైనా మొహం మీదే చెప్తూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.


జర్మనీ విదేశాంగ మంత్రి అమనెల్లా బీర్‌బాక్ బీజింగ్‌లో జరిగిన వ్యూహాత్మక సమావేశాలలో వ్యూహాత్మక చర్చలు నిర్వహించడానికి చైనాలో మూడు రోజుల పర్యటన కోసం మూడు రోజుల నుండి బీజింగ్‌లో ఉన్నారు. జర్మన్ విదేశాంగ మంత్రి తైవాన్‌లో బల ప్రయోగానికి వ్యతిరేకంగా చైనాను హెచ్చరించారు. ఇంకా దానికి బదులుగా ఉక్రెయిన్ గురించి ప్రస్తావించారు.  ఒకే చైనా విధానాన్ని ప్రపంచం లో ఎవరూ గౌరవించడం లేదని చెప్పుకొచ్చారు.


అక్కడకు వెళ్లి మీరు తైవాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు  చేస్తున్నారని తైవాన్ ని తైవాన్ లా బ్రతకనివ్వండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి. ఎందుకని దాంట్లో వేలు పెడతారు అంటూ చైనాలో ప్రశ్నించింది ఆవిడ. ఈవిడ ఇలా ప్రశ్నించన దానికి బదులుగా వెంటనే చైనా కూడా అదే విధంగా స్పందించింది.


వన్ చైనా పాలసీని  ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయి. నీ దేశం కూడా అంగీకరించింది. అందులో తైవాన్ ఏమీ ప్రత్యేక దేశం కాదు. అలా దాన్ని ఒక దేశం గా మీరు చూస్తున్నటువంటి నేపథ్యంలో అది మా దేశంలో ఉన్న ఒక ప్రావిన్స్ లాంటిది. కాబట్టి మీరు ఇన్వాల్వ్ కాకండి. ప్రపంచం కూడా ఇన్వాల్వ్ కావడం లేదు అంటూ అదే వేదిక మీద నుండి వార్నింగ్ ఇచ్చింది చైనా.


మరింత సమాచారం తెలుసుకోండి: