చైనా ఆఫ్రికా ఖండంపై ప్రస్తుతం కన్నేసింది. అక్కడకి వెళ్లి పరిశ్రమలు పెట్టాలని ప్రయత్నిస్తుంది. ఆఫ్రికా దేశాలకు ఆయుధాలను అమ్మాలని చూస్తోంది. అదే విధంగా ఆఫ్రికాలో తక్కువ ధరకు ఎక్కువ మంది లేబర్లు దొరుకుతుంటారు. వారితో పని చేయించుకుని డబ్బులు సంపాదించాలని చైనా ఆలోచిస్తుంది. దీంతో అమెరికా రంగంలోకి దిగింది. గతంలో ఎప్పుడో సాయం చేస్తానని చెప్పి మరిచిపోయిన అమెరికా, ప్రస్తుతం చైనా ఆఫ్రికాలో అడుగుపెట్టగానే మేము కూడా సాయం చేస్తానని  ముందుకొచ్చేసింది. ఆఫ్రికా నేతలతో మీటింగ్ కూడా పెట్టింది. ఇందులో రష్యా కూడా చేరింది.


భారత్ కూడా ఏ మాత్రం తక్కువ తినలేదు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా వారం రోజులు ఆఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు. మొజాంబిక్, ఉగాాండా లో మొత్తం ఆరు రోజులు పర్యటన సాగనుంది. మొజాంబిక్ లో మూడు రోజులు, ఉగాండాలో మూడు రోజులు ఉంటారు. సౌత్ ఈస్ట్రన్ ఆఫ్రికాలో పర్యటనలో భాగంగా ఆయన రైలులో వెళ్లారు. అది కూడా ఇండియా ఇచ్చిన రైలులోనే ఆయన వెళ్లడం గమనార్హం. ఈ రైలును ఇండియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఇచ్చింది. ఈ మధ్య 31 మంది ఆఫ్రికన్ ఆర్మీ అధికారులను భారత్ కు రప్పించింది.


వారందరికీ భారతదేశంలో తయారవుతున్న, వాడుతున్న ఆయుధాలను చూపించింది. లైన్ ఆఫ్ క్రెడిట్ కిందనే ఆయుధాలను ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల రష్యా ఆయుధాలను సరఫరా చేయలేకపోతుంది. కాబట్టి దీన్ని భారత్ అందిపుచ్చుకుని ఆఫ్రికా దేశాలకు ఆయుధాలను సరఫరా చేయాలని నిర్ణయించుకుంది. ఆఫ్రికా దేశాల్లో ఎన్నో పరిశ్రమలు పెట్టడానికి అనుకూలత ఉంది.


కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత్ అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలతో పోటీ పడుతోంది. 1975 సంవత్సరం దాకా మొజాంబిక్ కు స్వాతంత్య్రం రాలేదు. ఇలాంటి చోట అభివృద్ధి చేయడం అనేది చాలా అవసరం అని భారత్ భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: