ప్రపంచంలో ఉన్న ఏ ముస్లిం అయినా జీవితంలో ఒక్క సారైన సౌదీ అరేబియాలో ని మక్కా మసీదును సందర్శించాలని కోరుకుంటారు. హజ్ యాత్ర కు సంబంధించి సౌదీ అరేబియా ప్రపంచంలో ని అన్ని దేశాల్లో ఉన్నముస్లింలకు సందర్శించడానికి అవకాశం ఇస్తుంది.  అందులో ఒక్కో దేశానికి సంబంధించి ఇంతమంది రావడానికి వీసాలు ఇస్తామని చెబుతుంది. ఏయే దేశాలకు ఎంతమందికి ఇవ్వాలో సౌదీ నిర్ణయిస్తుంది. గతంలో పాకిస్థాన్ మా కోట పెంచండి, మాది ముస్లిం దేశం ఇక్కడి నుంచి మక్కాకు రావడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారని అడిగేది. అయితే అలా ఎక్కువ ఇవ్వడం కుదరదని సౌదీ చెప్పేది.


ఈ సంవత్సరం మాత్రం పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయి దీనావస్థలో ఉంది. ఎంతలా అంటే హజ్ యాత్రకు సౌదీ అనుమతించిన వీసాల్లో సగానికి సగం మాకు అవసరం లేదు. మీరే ఎవరికైనా ఇచ్చేసుకోండని చెప్పింది. ఎందుకంటే హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. రాయితీలు ఇచ్చేంత సొమ్ము ఇప్పుడు పాక్ వద్ద లేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్ తమకు ఇచ్చిన వీసాలను తిరిగి వెనక్కి ఇచ్చేసింది. ఇది అతి పెద్ద సంచలనంగా మారింది.


సౌదీ ఇచ్చిన అవకాశం ప్రకారం అందరూ వెళ్లాలంటే సౌదీకి  4500 డాలర్లు పాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే పాకిస్థాన్ కరెన్సీలో 1.2 మిలియన్ల వరకు అవుతుంది. దీంతో 70 శాతం ఖర్చు పెరిగింది. ఇది హజ్ యాత్ర కు సంబంధించిన కోటాను వెనక్కి ఇవ్వడంతో పాక్ పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కోటాకు సంబంధించిన హజ్ యాత్ర వీసాలను ఇండోనేషియాకు సౌదీ ఇచ్చింది. ప్రస్తుతం పాక్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఈ హజ్ యాత్ర కోటానే ఉదాహరణ గా తీసుకోవచ్చు. ఈ ఆర్థిక సంక్షోభం ముదిరి ఎటు వైపు దారి తీస్తుందో.. ఎలాంటి దారుణాలు జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: