
స్టేషన్ మాస్టర్ ఎల్ బి శర్మ ప్రమాదం అనంతరం కనిపించడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కొంతమంది ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో మసీదు ఉందని అబద్దపు ప్రచారం మొదలు పెట్టారు. అది ఇస్కాన్ టెంపుల్ అని చాలా మందికి తెలియదు. రైల్వే శాఖ మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని కొంతమంది చెబుతున్నారు.
కానీ రైల్వే శాఖ నివేదిక లో మాత్రం భయంకరమైన నిజాలు మరింత ఆందోళన కరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐఈడీని ఉపయోగించినట్లు, రైలు ఇంజిన్ భాగంలో ఉన్న అద్దాలపై చిన్నచిన్న రంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. రైలు ప్రమాదం జరగకముందే మొయిన్ లైన్ తో పాటు ఎలక్ట్రిక్ వైర్లు ప్రమాదానికి ముందే ధ్వంసం చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రమాదం జరిగిన బహనగరా రైల్వే స్టేషన్ లో పని చేస్తున్న అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కనిపించడం లేదని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
నిపుణుల ప్రాథమిక నివేదికలో మెయిన్ లైన్ పట్టాలు కొన్ని పగుళ్లు ఉన్నాయి. అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థ విఫలం కాలేదు. కావాలనే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను లూప్ లైన్ లోకి వెళ్లేలా చేసేందుకు ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో కొన్ని మార్చడం వల్లే ఇలాంటి దారుణ ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ చెబుతోంది. అయితే ఇది ఎవరైనా చేయించారా? మానవ తప్పిదమా.. లూప్ లైన్ లోకి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎందుకు వెళ్లింది. ఈ వివరాలు దర్యాప్తులో తేలనున్నాయి.