ఈ కాలంలో 30 సంవత్సరాల్లో పెళ్లి కాకపోతే ఆ తర్వాత పెళ్లి కావడం చాలా కష్టమవుతుంది. గత జనరేషన్ లో అందరూ దాదాపు 30  సంవత్సరాల లోపే పెళ్లి చేసుకున్న వారు. ఆ తర్వాత కెరియర్ లో సెటిల్ అవ్వాలని, బాగా డబ్బు సంపాదించాలి అని కొందరు 30 సంవత్సరాల తర్వాత కూడా పెళ్లి చేసుకునే వారు.

 

కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో 30 సంవత్సరాల లోపల పెళ్లి కాకపోతే, ఆ తర్వాత పెళ్లి కావడమనేది చాలా కష్టమవుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ప్రతి వెయ్యి మంది బాలురకు కేవలం 920 మంది మాత్రమే ఉండడం ఇది ఆడపిల్లలు డిమాండ్ పెరగడానికి ఒక ముఖ్య కారణం


. ఇంతకు ముందు పిల్లవాడికి పిల్లల చూడాలంటే కేవలం బంధువుల తరపున చూసే వాళ్ళు ,కానీ ఇప్పుడు ఆ పరిస్థితి సరిపోవట్లేదు మ్యారేజ్ బ్యూరో దెగ్గరికి వెళ్లవలసి వస్తుంది. అసలు మగాళ్లను కి పెళ్లి కాకపోవడానికి ప్రధాన కారణం జీవితంలో స్థిరపడడం మనం ఎంత బాగా చదువుకున్న కూడా సుస్థిర పడకపోతే మనకు ఎవరూ  పిల్లను ఇవ్వడానికి ముందుకు రారు. ఇప్పుడు జీవితంలో స్థిరపడే సరికి యువకులకి కనీసం 30 సంవత్సరాలు పడుతుంది.

 

వారందరికీ పిల్ల దొరకాలంటే చాల కష్టం అవుతుంది. మరో వైపు ఎంత సంపాదించినా కూడా చివరికి వయసు మీద పడితే పిల్ల దొరకడం కష్టం అవుతుంది. ఈ కాలంలో చాలా మంది యువకులు ఆ వయసు వచ్చేసరికి పిల్ల ఒకటి దొరికితే చాలు కట్నం లేకపోయినా పర్వాలేదు పెళ్లి చేసుకుంటామని స్థితికి వచ్చేస్తారు. మరో విషయమేమంటే అందరూ ఆడపిల్ల తల్లిదండ్రులు వ్యాపారం చేసే వారికి పిల్లలు ఇవ్వాలంటే భయపడుతున్నారు. ఎప్పుడు ఏ వ్యాపారం ఎలా మునిగి పోతుంది అని భయపడుతున్నారు దీంతో దేశంలో పెళ్లి కాని ప్రసాద్ల సంఖ్య చాలా పెరిగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: