ఏంటయ్యా ఆ జగన్ ...! అసలు ఇదేం పరిపాలనయ్యా ..? పెజలందరికి ఏదో మంచి పథకాలెట్టేసానని ఊరికే సంబరపడిపోతున్నాడు. ఏంటయ్యా అతగాడి గొప్పతనం ? ఎంత మంది కడుపు కొడుతున్నాడో ఆ జగన్ కి అర్ధం అవుతుందా అసలు. జగన్ తాగుబోతులకు ఎంత నరకం చూపిత్తున్నాడో ... రోజు రోజుకి రేట్లు పెంచేసుకుంటే ఎల్తే  తాగడానికి అప్పులు చేసి తిప్పలు పడాలా ..? నాకు తెలియకడుగుతా అసలు పెబుత్వం మందు అమ్మడం ఎక్కడైనా ఉందా ? అన్నీ పెభుత్వమే అమ్మేత్తే మందు యాపారులు ఏమైపోవాలి ..?  తాగుబోతులంటే ఇంత అలుసయిపోయారా ? ఇయన్నీ ఎవరో కూసిన కారు కూతలు కాదండోయ్ ! సాక్షాత్తు మన ఫార్టీ యియర్స్ ఇండ్రస్ట్రీ సెంద్రల సారు బుస్స్ లో నుంచి కూసిన కస్సు బుస్సు కూతలు. 


ఎప్పటి నుంచో జగన్ మీద దాచుకున్న పగ, పతీకారం ఉప్పూ కారం ఇవన్నీ మిక్స్ చేసి ఇప్పుడు బస్సు యాత్ర మొదలెట్టేసాడు. అసలు 70 సంవత్సరాల వయస్సులో ఈ ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండ్రస్ట్రీ పెద్ద మనిషి ప్రజల ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అసలు ఆలోచన ఉందా ? నిన్న ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు నోటికొచ్చిందల్లా మాట్లాడేసేడు. అసలు తన ప్రసంగం ఆడోల్లు వింటున్నారు ... తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారనే కనీస జ్ఞానం లేకుండా జగన్ తాగుబోతుల పొట్టగొడుతున్నాడు అంటాడా ? జగన్ మద్యం రేట్లు పెంచేసాడని, తాగాలంటే అప్పులపాలవుతున్నారని అంటాడా ..? అసలు ఓ పెద్ద మనిషి ప్రజల శ్రేయస్సు కోరుకునే మనిషి మాట్లాడే మాటలేనా ఇవి ..? 


అసలు ప్రభుత్వానికి ప్రధాన ఆర్దయా వనరు ఏమైనా ఉందా అంటే అది మద్యం ద్వారానే అన్న సంగతి సెంద్రాల సారుకి బాగా తెలుసు. ఇప్పటికే ఆయన ఆ భ్రమ నుంచి బయటకి రాలేదు. కానీ ఆ జగన్ మొండోడు బాబోయ్ ...! ఒక పక్క బెల్టు షాపులు మూత ఏయించేసాడు. ఇంకో పక్క బార్లు, బ్యాంది సాపుల లైసెన్స్ రేట్లేమో అమాంతం పెంచేసాడు. మందు అమ్మే సమయం కూడా తగ్గించి పడేసాడు. అయినా ఎలా ఎలా నడుపుతున్నాడు పభుత్వాన్ని ..? ఎంత గింజుకున్నా అర్ధమయ్యి సవట్లేదుగా ఆ పెద్ద మనిషి సెంద్ర బాబు కి. అసలు పాయింట్ .. బాబు బాధ మీకు ఎవ్వరికి అర్ధం కాలేదు. 


కూలీ నాలి చేసుకుని వచ్చిన సొమ్మంతా పిల్లలు, పెళ్ళాన్ని పోషించక్కర్లేకుండా ఫుల్లుగా తాగి తూగుతూ ఇంటికెళ్లే కొంతమంది మందు బాబుల గురించి ఏ మాత్రం ఆలోచన లేకుండా రేట్లు పెంచేస్తే పాపం వాళ్ళు ఎంత బాధపడతారో అనే కదా ఈ పెద్ద మనిషి అసలు బాధ అంతా.. ! అది మీరు ఎవ్వరూ అర్ధం చేసుకోకుండా పాపం ఆ పెద్ద మనిషిని ఆడిపోసుకుంటున్నారు కదా ! అసలు ఆ జగన్ కుట్ర అంతా ఇప్పుడు అర్ధం అయిపొయింది ... ! సెంద్రబాబు కు మందు బాబులంటే సేనా పేమ ఉంది అని పసిగట్టేసే ఈ జగన్ కనీసం జాలీ దయా లేకుండా మందు బాబు .. సెంద్ర బాబులను క్షోభ పెట్టేస్తున్నాడు. 


అసలు బాబు పడుతున్న బాధ ఆ జగన్... ఈ ఆడోల్లు... అస్సలు అర్ధం చేసుకోవట్లేదు. మద్యం గురించి మాట్లాడుతుంటే మందు సిండికేటోళ్ళకి, మందు బాబులికి తెగ బాధ తన్నుకొచ్చేస్తుంది. సూసారా ఎంతయినా మా సెంద్ర బాబు సెంద్ర బాబేరా ! మన పెళ్ళాం పిల్లలు ఎలా పోతేనేం మనం తాగుతూ.. ఊగుతూ ఉండాలని ఇప్పటికీ కోరుకుంటున్నాడు. పదండ్రా అప్పుసేసి అయినా ఆయన బస్సు ముందు నాలుగు పెగ్గులేసి డాన్సులు సేద్దాం... ! 

మరింత సమాచారం తెలుసుకోండి: