అనుకోని విపత్తు వచ్చిపడింది. ప్రపంచమంతా విలవిలలాడుతోంది. ఇప్పుడొచ్చిన కష్టం ఎప్పుడు తీరుతుందో... ఎంత నష్టం చేకురుస్తుందో తెలియదు. అసలు ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు. కానీ కంటికి కనిపించని ఆ వైరస్ మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్  అత్యవసరం,మరో మార్గం కనిపించడంతో ప్రపంచ దేశాలన్నీ ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలపై గట్టి ప్రభావమే చూపిస్తోంది. మార్చి 24 వ తేదీ అర్ధ రాత్రని నుంచి ఏప్రిల్ 14 వ తేదీ వరకు ముందుగా లాక్ డౌన్ విధించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మే మూడో తేదీ వరకు దీనిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ తరుడితో అయినా లాక్ డౌన్ ముగుస్తోందా అంటే అదే కూడా అనుమానంగానే ఉంది. 

 

IHG

విడతలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంటే మరికొంతకాలం దీనిని పొడిగించినా అనుమానం లేదు. పరిస్థితి ఇప్పటికి అదుపులోకి రాకపోవడంతో, ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఒక్కటే మార్గంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ... ఈ నిర్విరామ లాక్ డౌన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కనీసం తక్కువలో తక్కువ 50 కోట్ల మంది దినసరి కూలీలు, పేదలు, కార్మికులు మరింత పేదరికంలో దిగజారిపోయి అవకాశం కనిపిస్తున్నట్టుగా ఆర్థిక వేత్తలు లెక్కలు వేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు తట్టుకుంటాయి. 

 

IHG

మన రాజకీయ నేతలపై దీని ప్రభావం ఎంత వరకు ఉంటుంది ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మోదీ ఈ విపత్తుని ఎలా ఎదుర్కొని భారత ప్రజలకు భరోసా ఇవ్వగలరు అనేది ప్రశ్నగా మారింది. మోదికి కఠిన పరీక్షలు కొత్తేమి కాదు. మూడున్నరేళ్ల క్రితం ఇదేవిధంగా ఓ అర్ధరాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ మనీ ని కంట్రోల్ చేసేందుకు ఈ విధంగా సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది పేదల బతుకులపాలిట జీవన్మరణ సమస్యగా మారింది. ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న ఈ లాక్ డౌన్ నిబంధన కారణంగా ఎంతోమంది జీవితాలను చీకట్లోకి నెట్టివేసింది అన్నది వాస్తవం. 

 

ఇక వలస బతుకుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పిల్ల పాపలతో రాష్ట్రాలు కానీ రాష్ట్రాల్లో ఉపాధి పొందేందుకు వెళ్లి... అక్కడ పనిచేసేందుకు అవకాశం లేక, తినేందుకు తిండిలేక వందల కిలోమీటర్ల దూరం పిల్లాపాపలతో నడిచి నడిచి ఆలోసిపోతూ ... కుప్పకూలిపోతున్న బతుకులు ఎన్ని ..? ఇంకా ఇరుకు గదుల్లో కుక్కుకుని ఉంటూ.. ఉండలేక ... బయటకు వెళ్లలేక సతమతం అవుతున్న జీవితాలు ఎన్ని ...? ఇళ్లల్లోనే కుటుంబాలతో ఉంటూ తినేందుకు తిండిలేని వారి పరిస్థితి ఏంటి..? కొన్ని రాష్ట్రాలు రేషన్ ఇస్తున్నా... ఇవ్వని రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి ..? రేషన్ కార్డు కాదు కదా ఏ గుర్తింపు లేని వారి పరిస్థితి ఏంటి..? మన దగ్గర ఏడున్నర మిలియన్ల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నా వాటిని ఇంకెప్పుడు జనాలకు పంచుతారు..? 

 

పేగులు మెలివేసే ఆకలికి ఇప్పుడు వాయిదాలతో సమాధానం చెబితే అసలు ప్రాణాలే మిగలవన్న సంగతి ప్రభుత్వాలు మర్చిపోతే ఎలా ..?  బతుకు ముఖ్యమా ...? బ్రతుకుతెరువు ముఖ్యమా ..? రెండూ ముఖ్యమే. నిజంగా ఇది అతిపెద్ద క్లిష్ట సమయమే. నిజంగా ఇది కేంద్రానిదే కీలక బాధ్యత. ప్రజలకు కొన్ని నియమాలు విధించారు సరే..! కేంద్రం పాటించాల్సిన ఆదేశిక సూత్రాల మాట ఏంటి ..? రసాలకు న్యాయంగా రావాల్సిన పన్నుల్లో వాటాల సంగతి ఏంటి..? రాష్ట్రాలకు అందాల్సిన సహాయం మాట ఏంటి ..? తక్షణం విడుదల చేయాల్సిన నిధుల సంగతి ఏంటి..? ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. అసలు ఇది అనుకోని విపత్తే ...దీనికి ప్రజలు కొన్ని కొన్ని త్యాగాలు చేయాల్సిందే... కానీ ఈ సమయంలో ప్రజల ఆకలి బాధలు.. వ్యధలు తీర్చాల్సిన బాధ్యత ... బరువు ఖచ్చితంగా ప్రభుత్వాల మీదే ఉంది.

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: