అవును రాష్ట్రలో అనేక పార్టీలున్నప్పటికీ అడ్డుగోలు వాదన వినిపించేదెవరయ్యా అంటే టీడీపీనే అని ఠకీమని సమాధానం చెప్పేస్తారు ఎవరైనా. ఎందుకింతగా అడ్డుగోలు వాదనలు చేస్తుందంటే అదంతే. అధినేతను బట్టే నేతలు మాట్లాడుతారన్న విషయం అందరికీ తెలిసిందే.  పార్టీ ఎన్టీయార్ చేతిలో ఉన్నంత వరకు ఇటువంటి పద్దతి ఉండేదికాదు. పార్టీ పగ్గాలను చంద్రబాబునాయుడు ఎప్పుడైతే చేతిలోకి తీసుకున్నారో అప్పటి నుండే ఇటువంటి విచిత్రమైన వాదనలు మొదలుపెట్టారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పటం, తప్పులను కూడా ఒప్పులుగా చూపించే ప్రక్రియ అప్పటి నుండే ఊపందుకుంది. అప్పుడు మొదలైన ఈ అలావాటునే కొత్తగా అధ్యక్షునిగా నియమితుడైన కింజరాపు అచ్చెన్నాయుడు కూడా కంటిన్యు చేస్తున్నాడు.




రెండు రోజుల క్రితమే వాయిదాపడిన స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి 18 రాజకీయ పార్టీల ప్రతినిధులను పిలిచారు. పిలిచిన వారిలో కొందరొచ్చారు కొందరు రాలేదు. హాజరైన వాళ్ళల్లో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయం కోసమే మీటింగులని అంటున్నా నిమ్మగడ్డ ఉద్దేశ్యం కూడా ఎన్నికలను నిర్వహించాలనే అన్న విషయం అర్ధమైపోతోంది.  కాబట్టి  ఎన్నికలను నిర్వహించాలనే టీడీపీ కూడా చెప్పింది. ఇదే సమయంలో ఎన్నికలు వాయిదాపడే నాటికి ఏకగ్రీవాలైన జడ్పీటీసీ, ఎంపిటీసీ ఫలితాలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది. సరే నిమ్మగడ్డ ఏమి చేస్తారనే విషయం ప్రస్తుతానికైతే సస్పెన్సే అనుకోవాలి.




నిమ్మగడ్డతో సమావేశమై బయటకు వచ్చిన అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ తగ్గిపోయింది కాబట్టి రాష్ట్రంలో ఎన్నికలు పెట్టాలన్నారు. రోజుకు వేలాది కేసులు నమోదవుతున్నపుడు తగ్గిందని ఎలా చెబుతారని ఓ రిపోర్టర్ అడిగారు. మార్చికన్నా అక్టోబర్ లో కేసులు తగ్గాయి కదా అని అచ్చెన్న సమాధానం ఇచ్చారు. అప్పట్లో దేశమంతా కేసులున్నాయి, ప్రపంచంలో లక్షల్లో కేసులున్నాయి కాబట్టి అప్పుడు ఎన్నికలను వాయిదా వేయమని డిమాండ్ చేశామని అచ్చెన్న సమర్ధించుకున్నారు. ఇపుడు ప్రపంచమంతా కేసులు తగ్గిపోతున్నాయట. దేశంలో కూడా అప్పటికన్నా ఇపుడు కేసుల సంఖ్య తగ్గిపోయింది కాబట్టే ఎన్నికలు నిర్వహించమని అడుగుతున్నామని చెప్పారు. నిజానికి తాను చాలా తెలివిగా సమాధానం చెప్పానని అచ్చెన్న అనుకుని ఉండవచ్చు.




కానీ వాస్తవం ఏమిటంటే ఏపిలో ఎన్నికలు మార్చిలో వాయిదా వేయటానికి దేశంలోను, ప్రపంచంలోని కేసులతో ఏమిటి సంబంధం ? ఎన్నికలు జరుగుతున్నది ఏపిలో కాబట్టి అప్పట్లో అంటే మార్చిలో ఎన్ని కేసులున్నాయన్నదే ఇంపార్టెంట్. కరోనా వైరస్ ను బూచిగా చూపించి నిమ్మగడ్డ ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేసిన సమయానికి రాష్ట్రం మొత్తం మీద పట్టుమని పదికేసులు కూడా లేవన్నది వాస్తవం.  మరిపుడు రోజుకు ఎన్ని కేసులు నమోదవతున్నాయి ?  అప్పట్లో పది కేసులు మాత్రమే ఉంటే ఇపుడు రోజుకు 4 వేల కేసులు నమోదవుతున్నాయి. మార్చితో పోల్చితే కేసులు ఎక్కువయినట్లా ? తగ్గినట్లా ? అచ్చెన్న మాత్రం కేసుల సంఖ్య తగ్గాయనే వాదిస్తున్నారు. దీన్నే మామూలు జనాలు అడ్డుగోలు వాదనంటారు.




పదవిలో నుండి దిగిపోయేలోగా కుదిరితే ఎన్నికలు నిర్వహించాలని లేకపోతే ఏదో రూపంలో ప్రభుత్వంతో గొడవలు  పాలన్నది నిమ్మగడ్డ ఆలోచనగా ఉంది. నిమ్మగడ్డ ఆలోచనకు తగ్గట్లుగా తాళం వేయటమే టీడీపీ పనిగా ఉంది. అందుకనే నిమ్మగడ్డ అప్పుడు వాయిదా అనగానే టీడీపీ వాయిదా వేయమంది. ఇపుడు కేసులు తగ్గిపోతున్నాయి కాబట్టి ఎన్నికలు జరపాలంటే టీడీపీ కూడా జరపాలంటోంది. విచిత్రమేమిటంటే కరోనా వైరస్ నేపధ్యాన్ని టీడీపీ బాగా వాడుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురద చల్లాలని అనుకున్నపుడల్లా వైరస్ నియంత్రణలో ప్రభుతం ఘోరంగా విఫలమైందంటు చంద్రబాబు మండిపోతుంటారు. జగన్ చేతకాని తనంవల్లే రాష్ట్రంలో కేసులు పెరిగిపోతున్నాయంటు చంద్రబాబు నెలల తరబడి గోల చేశారు. ఇపుడేమో  ఇదే చంద్రబాబు కేసుల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఏ విషయంలో కూడా ఒక స్టాండ్ లేకుండా గాలివాటున అడ్డుగోలు చేస్తున్న రాజకీయ పార్టీ ఏదయ్యా అంటే టీడీపీ మాత్రమే అని అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: