ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చేసుకున్న చంద్రబాబునాయుడు నిప్పుతో చెలగాటమాడుతున్నారా ? అంటే అవుననే అనుకోవాలి. ఎందుకంటే తన హయాంలో లబ్దిదారులకు అందించాల్సిన ఇళ్ళను ఇవ్వటంలో చంద్రబాబు ఫెయిలయ్యారు. అలాంటిది ఇపుడు సంక్రాంతి పండుగ నుండి ఇళ్ళను స్వాధీనం చేసుకోవాలనే నినాదాన్ని ఇవ్వటమే విచిత్రంగా ఉంది. పైగా ఇళ్ళకే తమ ఉద్యమాన్ని పరిమితం చేయకుండా ఇంటి స్ధలాలను కూడా చంద్రబాబు చేర్చటం మరింత విచిత్రం. ఎందుకంటే పేదలకు 30 లక్షల ఇళ్ళ  స్ధలాలను పంపిణి చేయాలన్న జగన్ ప్రోగ్రామ్ ను అడ్డుకున్నదే చంద్రబాబనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. తన మనుషులతోనే ఇళ్ళ పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా చంద్రబాబే కోర్టుల్లో కేసులు వేయించారనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇటు ఇళ్ళు, అటు ఇంటి స్ధలాలు రెండూ వివాదాస్పదమయ్యాయి. ఇటువంటి వివాదస్పద వివాదాలను టేకప్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టాలని చంద్రబాబు ప్లాన్ చేశారు.




తన హయాంలోనే 6 టిడ్కో  ఇళ్ళను పూర్తి చేశామని చంద్రబాబు+టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వాటని లబ్దిదారులకు ఇవ్వకుండా జగన్ వేధిస్తున్నారంటే రోజు గోల చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు చెప్పిందే నిజమనుకుందాం. మరి తమ హయాంలోనే పూర్తయిన ఇళ్ళను లబ్దిదారులకు చంద్రబాబే ఎందుకు ఇవ్వలేదు ?   3 లక్షల ఇళ్ళ సామూహిక గృహప్రవేశాల పేరుతో అప్పట్లో నానా హడావుడి చేసిన టీడీపీ సర్కార్ లబ్దిదారులకు ఇళ్ళ తాళాలను ఎందుకు అప్పజెప్పలేదు ? ఈ ప్రశ్నలకు మళ్ళీ ఎల్లోబ్యాచ్ లో ఎవరు సమాధానం చెప్పటం లేదు. ఎందుకు లబ్దిదారులకు ఇళ్ళను ఇవ్వలేదంటే ఏ ఇల్లు కూడా పూర్తిగా నిర్మించలేదు కాబట్టే. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాజిటివ్ ప్రచారం కోసం హడావుడిగా ఏదో తంతు నడిపించారు. కాకపోతే అసలు విషయం లబ్దిదారులకు తెలుసు కాబట్టి వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది.




అసంపూర్తిగా చంద్రబాబు వదిలేసిన ఇళ్ళను జగన్ ప్రభుత్వం పూర్తి చేస్తోంది. కారణాలు ఏమిటో స్పష్టంగా తెలీదు కానీ జగన్ సర్కార్ కూడా డిడ్కో ఇళ్ళను పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వటంలో ఆలస్యం చేస్తోంది. దీన్నే చంద్రబాబు వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మలచుకోవాలని డిసైడ్ చేశారు. దీనికి సంక్రాంతి పండుగను ముహూర్తంగా పెట్టుకున్నారు. మరి ఎంతమంది లబ్దిదారులు సానుకూలంగా స్పందిస్తారో చూడాల్సిందే. ఇక ఇదే సందర్భంగా ఇంటి స్ధలాల విషయంలో కూడా ఉద్యమం చేయాలని చంద్రబాబు పెద్ద పిలుపే ఇచ్చారు. ఇళ్ళంటే తమ కమిట్మెంట్. కానీ ఇళ్ళ స్ధలాలకు చంద్రబాబుకు ఏమీ సంబంధం లేదు.  అధికారంలోకి వస్తే ఐదేళ్ళల్లో 30 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ అన్నది జగన్ హామీ. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టగానే రాజధాని అమరావతి ప్రాంతంలోని  కొందరు కోర్టుల్లో కేసులు వేసి స్టే పట్టకొచ్చిన కారణంగా ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తన హామీ ప్రకారం ఇళ్ళ కట్టించి లబ్దిదారులకు ఇవ్వటంలో ఫెయిలైన చంద్రబాబు కనీసం ఇళ్ళ పట్టాల పంపిణీని కూడా ముందుకు సాగనీయలేదు. మళ్ళీ తగుదునమ్మా అంటూ ఇఫుడు ఇళ్ళు, ఇంటి స్ధలాల కోసం ఉద్యమాలు చేయాలంటు పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది. మొన్ననే మాజీ మంత్రి దేవనేని ఉమ మైలవరం నియోజకవర్గంలోని జక్కంపూడి-షాబాద్ గ్రామానికి వెళ్ళినపుడు గ్రామస్తుల చేతిలో జరిగిన సత్కారాన్ని చంద్రబాబు చూసే ఉంటారు. అదే పనిగా ప్రతిరోజు ఏదో గ్రామంలోకి వెళ్ళి జగన్ ప్రభుత్వాన్ని తిట్టటమే పనిగా దేవినేని పెట్టుకున్నారు. తాను గ్రామానికి వెళ్ళేటపుడు వెంట మద్దతుదారులతో పాటు మీడియాను కూడా వెంటపెట్టుకుని వెళ్ళటం దేవినేనికి అలవాటు. ఇందులో భాగంగానే జక్కంపూడి గ్రామానికి వెళ్ళినపుడు స్ధానికులు మాజీమంత్రిపై విరుచుకుపడ్డారు. భూకబ్జాలు, అక్రమ మైనింగ్, ఇళ్ళ కేటాయింపులో అవినీతికి పాల్పడింది నీవే అంటూ మాజీమంత్రిపై గ్రామస్తులు మండిపడ్డారు. దాంతో ఏమి మాట్లాడాల్ అర్ధంకాని దేవినేని పరిగెత్తుకుని గ్రామంలో నుండి వెళ్ళిపోయారు. జనాల్లోకి వెళ్ళినపుడు చంద్రబాబుకు కూడా ఇటువంటి సత్కారమే జరిగినా ఆశ్చర్యంలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: