సహజంగానే తెలంగాణలో బిజెపి తమ సత్తా చాటుకుని దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తన ఖాతాలో వేసుకోవడం ఏ విధంగా సాధ్యం అయ్యింది అనే విషయం మిగతా రాజకీయ పార్టీలన్నిటికి కాస్త షాక్ కలిగించే అంశమే. అసలు ఆ పార్టీ ఈ స్థాయిలో ఏవిధంగా బలం పుంజుకుంది అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఈ పరిణామాలు ఏమాత్రం రుచించడం లేదు. అయితే గత కొంత కాలంగా చూసుకుంటే,  తెలంగాణలో కాంగ్రెస్ బాగా బలహీనపడి తమ స్థానాన్ని బీజేపీకి ఆ పార్టీ నేతలే స్వయంగా కట్ట పెట్టినట్టుగా వ్యవహరించారు.



 ప్రభుత్వంలోని లోపాలను ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తూ, బలం పుంజుకోవడం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ విషయాన్ని పక్కన పెట్టి, సొంత పార్టీ నాయకుల పై యుద్ధానికి దిగడం, ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం, ఒకరికి అవకాశం దక్కకుండా మరొకరు అడ్డుపడటం, ఇలా  కారణాలతో తెలంగాణలో బిజెపి బలపడేందుకు అవకాశం దక్కింది. దీనికితోడు పార్టీలోని నాయకులు అందరూ సమిష్టిగా కృషి చేయడం,  కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండడం, స్థానిక సమస్యలపై పూర్తిగా ఫోకస్ పెంచి బలమైన రాజకీయ పార్టీగా తయారవడం, ఇలా ఎన్నో కారణాలతో ఆ పార్టీలో ఉంటూ వచ్చింది. ఇక తెలంగాణలో జరగబోయే ఏ ఎన్నికల్లో అయినా, టిఆర్ఎస్ ను ఢీకొట్టేబోయేది బిజెపి అనే విషయం అర్థమైపోయింది.



ఈ సంగతి ఇలా ఉంటే , ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటనే విషయం కూడా చర్చనీయాంశం అవుతోంది. గతంతో పోలిస్తే కాస్తో కూస్తో బలోపేతం అయినట్లే కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం బీజేపీకి ఇంకా వచ్చినట్టు కనిపించడంం లేదు. నిత్యం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ ,అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేసి, క్రమక్రమంగా పార్టీ పటిష్టతకు శ్రీకారం చుట్టినా, పూర్తి స్థాయిలో ఆ వ్యవహారాలపై దృష్టి సారించింది. దీనికి కారణం సొంత పార్టీలోని నాయకులు మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ, తెరవెనుక చాటుమాటు వ్యవహారాలు చేస్తూ,  ప్రత్యర్థి పార్టీలకు సహకారం అందించడం వంటి కారణాలు , ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉండటం, ఇలా ఎన్నో కారణాలతో అంతర్గతంగా బిజెపి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. 



మొదటి నుంచి ఏపీలో బీజేపీ బలం పెంచుకో లేకపోవడానికి కారణాలుగా కనిపిస్తోంది. ఇవేే కాకుండా రెండు మూడు గ్రూపులుగా , ఏపీ బిజెపి ఉంటూ వస్తోంది. సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత, అవి కాస్త కంట్రోల్ అవుతాయని భావించిన, ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుండటంతో బిజెపి బలోపేతం అవుతుందా లేదా అనేది సందేహంగా మారింది. సోము వీర్రాజు వరకు చూసుకుంటే, బిజెపి అధికారం వైపు తీసుకువెళ్లేందుకు, అలాగే ఆ పార్టీ నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసేందుకు వెనుకాడటం లేదు. ఈ పరిణామాలు పార్టీలోని కొంతమంది నాయకులకు నచ్చకపోవడంతో పార్టీలో ఈ తరహా పరిస్థితులు తలెత్తినట్టు గా  కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: