ఇదే విధంగా కేంద్రం అనేకసార్లు రైతులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించింది. కానీ ఆ చర్చలు ఏవీ సఫలం కాలేదు. కొన్ని కొన్ని సంస్కరణలు తీసుకువచ్చేందుకు కూడా కేంద్రం ఒప్పుకుంటున్నా, పూర్తిగా వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాల్సిందే అని రైతులు పట్టుబడుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి తట్టుకుంటూ రోజుల తరబడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రభుత్వం అంతే స్థాయిలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది తప్ప, దీనిపై వెనక్కి తగ్గేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. అసలు రైతులను మెప్పించే విధంగా, ఈ నూతన వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించడంలో కేంద్రం విఫలమైనట్లు కనిపిస్తోంది.
ఇప్పటి వరకు కేంద్రంలో తాము ఏ నిర్ణయం తీసుకున్నా, అది ఎటువంటి సవరణలు లేకుండానే ఆమోదం పొందాయని, కానీ ఈ నూతన వ్యవసాయ చట్టం విషయంలో మాత్రం ఈ విధమైన వ్యతిరేకత వస్తుందని కేంద్రం సైతం ఊహించలేకపోతోంది. అందుకే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. రైతులు అంతే స్థాయిలో ఈ చట్టం పై పోరాడేందుకు సిద్ధం గానే ఉన్నారు. ఎన్నాళ్లైనా ఈ ఉద్యమాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టిన రైతులు ఇప్పుడు అదే తరహాలో సరికొత్త నిరసన కార్యక్రమాలకు దిగారు. గతంలో మోదీ చెప్పినట్లుగానే ఇప్పుడు రైతులు వినూత్న రీతిలోనే నిరసనలు తెలుపుతూ కేంద్రానికే ఝలక్ ఇస్తున్నారు.
ప్లేట్లు, గ్లాసుల, డప్పులు ద్వారా తమ నిరసనలు తెలుపుతున్నారు. ఇక ప్రపంచ దేశాలు సైతం భారత్ లో జరుగుతున్న రైతుల ఉద్యమం ను ఆసక్తిగానే పరిశీలిస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ముందు ముందు ఇదే ప్రతిష్టంభన కొనసాగేలా విధంగానే కనిపిస్తూ వస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి