‘ఎన్నికలు నిలిపేస్తే ..ప్రజాస్వామ్యంపై జనాలకు నమ్మకం పోతుంది’ ఇది స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపున కమీషన్ లాయర్ కోర్టులో చేసిన వ్యాఖ్యలు. కమీషన్ తరపున లాయర్ చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే అసలు ఎన్నికలపైనా, ప్రజాస్వామ్యంపైనా నమ్మకం లేనిదే కమీషనర్ నిమ్మగడ్డకు. ఇన్ని వివాదాలకు మూల కారణమైన స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగాల్సిందెప్పుడు ? 2018 జూలై-ఆగష్టులో. ఇపుడిన్ని కతలు చెబుతున్న నిమ్మగడ్డ మరపుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు ? అప్పట్లోనే మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించినా అప్పటి చంద్రబాబునాయుడు కానీ నిమ్మగడ్డ కానీ ఎందుకని ఎన్నికలు నిర్వహించలేదు.



తానేదో రాజ్యాంగ పరిరక్షునిగాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే అవతరించిన అవతారంగా కబుర్లు చెబుతున్న నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణ కోసం చంద్రబాబు హయాంలో ఎందుకని ప్రయత్నించలేదు ? అంటే ముఖ్యమంత్రి మారిపోతే నియమాలు, నిబంధనలు, ప్రజాస్వామ్య స్పూర్తి, రాజ్యాంగబద్దమైన విలువలు అన్నీ మారిపోతాయా ? ఎంతసేపు ఎలక్షన్ కమీషన్ రాజ్యాంగబద్దమైన అధికారాలు గల సంస్ధగా చెప్పుకుంటున్న నిమ్మగడ్డకు ఈ విషయం చంద్రబాబు హయాంలో ఎందుకు గుర్తులేదో అర్ధం కావటం లేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణలో ఇపుడింత కంపు రేగటానికి కేవలం నిమ్మగడ్డ మాత్రమే కారణమని జనాలందరు అనుకుంటున్నారు. ప్రధానంగా నిమ్మగడ్డ మూడు తప్పులు చేయటంతోనే ఇపుడింతగ గబ్బు లేస్తోంది.



మొదటిది 2018లోనే ఎన్నికలు పెట్టేసుండాలి. తనంతట తానుగా పెట్టకపోయినా కనీసం కోర్టు ఆదేశించినట్లయినా అప్పట్లోనే ఎన్నికలు నిర్వహించేసుంటే బాగుండేది. సరే అప్పట్లో చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే ఎన్నికలు పెట్టలేదని అనుకుందాం. ఇపుడు అంటే మొన్నటి మార్చిలో జరుగుతున్న ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నపుడు ఏకపక్షంగా వియిదా వేశారు. అప్పట్లో ఎన్నికలను వాయిదా వేయాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వంతో సంప్రదించుంటే బాగుండేది. మొన్నటి మార్చిలో లేని కరోనా వైరస్ భూతాన్ని చూపించి ఎన్నికలను ఏకపక్షంగా వేసిన నిమ్మగడ్డ వ్యవహారశైలి వల్లే ఇపుడింతగా కంపు జరుగుతోంది. పైగా ఇఫుడు అర్జంటుగా ఎన్నికలు నిర్వహించకపోతే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని చెప్పటమే విచిత్రంగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: