ఇపుడీ విషయమే రాజకీయవర్గాల్లో పెద్ద చర్చగా మారింది. అవసరం అనుకున్నపుడు ఇదే ఎల్లోమీడియా బీజేపీని ఆకాశానికి ఎత్తేసింది. అవసరం లేదని అనుకున్నపుడు బీజేపీని జనాలకు బూచిగా చూపించింది. అంటే ఇక్కడ అవసరం అంటే కేవలం చంద్రబాబునాయుడు అవసరం అని మాత్రమే అర్ధం. ఎందుకంటే సర్వకాల సర్వాస్ధల్లో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుందనే ఆరోపణలున్న ఎల్లోమీడియా ఒకసారి కమలంపార్టీని నెత్తిన పెట్టుకుంటుంది. మరోసారి తీసి నేలకేసి కొడుతుందన్న విషయం ఇఫ్పటికే జనాలకందరికీ అర్ధమైపోయింది. ఇపుడు తాజాగా అంటే గడచిన మూడు రోజులుగా బీజేపీ నేతలను ఎల్లోమీడియా వెంటాడుతోంది. తమ స్టూడియోలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని అమరావతి జేయేసీ కన్వీనర్ శ్రీనివాస్ చెప్పుతో దాడి చేసిన విషయం తెలిసిందే.




విష్ణుపై జరిగిన దాడి వ్యూహాత్మకంగా జరిగిందనే అనుమానాలు బీజేపీ నేతల్లో బలంగా ఉంది. దానికి తగ్గట్లే తమ నేతలు ఏబిఎన్ చానల్ చర్చల్లో పాల్గొనబోరని చెప్పింది. అలాగే మీడియా సమావేశాలకు కూడా ఆంధ్రజ్యోతి విలేకరులను ఆహ్వానించేది లేదని బహిష్కరించింది. దాంతో ఎల్లోమీడియా యజమాన్యానికి మండింది. అందుకనే ఆదివారం రాసే కొ(చె)త్తపలుకులో బీజేపీ చీఫ్ సోమువీర్రాజు తో పాటు మరో ముగ్గురిని బ్లాక్ మెయిలర్లంటు ఆరోపణలు చేసింది. నరేంద్రమోడి సర్కార్ ను చూపించి బెదిరించి బతికేస్తోందంటు చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది. దానికి కొనసాగింపుగానే సోమవారం ‘కమలనాధుల...చీకటి కోణం’ అనే పేరుతో మరో బ్యానర్ కథనాన్ని ప్రచురించింది.




నిజానికి  ఈ కథనంలో కొత్త విషయం ఏమీలేదు. అధికారంలో ఉన్నపుడే ఏ నేతైనా నాలుగు రాళ్ళు వేనకేసుకోవాలని అనుకుంటారు. ఇది చాలామంది నేతలు చేసేపనే. అంతెందుకు చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని సదరు ఎల్లోమీడియా యాజమాన్యం కూడా వందల కోట్లను వెనకేసుకుందనే ఆరోపణలకు కొదవేలేదు. అలాంటి ఆరోపణలనే తాజాగా బీజేపీలోని ఇద్దరు ప్రముఖ నేతలంటు ఓ కథనం అల్లేసింది. తాను రాసిన కథనం నిజమనే నమ్మకముంటే ఇద్దరు నేతలు అని రాసేబదులు డైరెక్టుగా వాళ్ళ పేర్లు రాసేసుండాల్సింది. ఎలాగే నలుగురు బీజేపీ నేతలు బ్లాక్ మెయిలర్లంటు పేర్లు రాసినపుడు ఇపుడు కూడా ఆ ఇద్దరి పేర్లను రాయటానికి ఎందుకు వెనకాడింది ? ఇలాంటి గాలి కతలను బ్యానర్లుగా చేయటం ఎల్లోమీడియాకు బాగా అలవాటే. ఆరుగురు జడ్జీల ఫోన్లను ప్రభుత్వ అనధికారికంగా ట్యాపింగ్ చేయిస్తోందని గతంలో ఓ గాలివార్తను బ్యానర్ గా అచ్చేసిన విషయం తెలిసిందే.  మొత్తానికి ఎక్కడ చెడిందో కానీ బీజేపీ నేతల వెంట ఎల్లోమీడియా పడిందన్నది వాస్తవం. చూద్దాం చివరకేమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: