సాగరం బాగుంటేనే సకల జీవరాసులు బాగుంటాయి అనే విషయాన్ని విస్మరిస్తున్నారు చాలావరకు. సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు అని, సముద్రానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 8 న సముద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. సముద్రాన్ని చెత్త మయం చేసేస్తున్నారని, చాలా దేశాల్లో వ్యర్థాలను నౌకలో తరలించి సముద్రంలో పడేస్తున్నారని, ఇలా రోజూ వేల టన్నుల్లో చెత్త సముద్రంలో కలుస్తుందనీ,అందులో ఎక్కువ భాగం ప్లాస్టిక్ ఉంటుందని, ఈ కాలుష్య కారకం వల్ల సముద్రాల అరుదైన జీవజాతులు అంతరించిపోతున్నాయనీ ప్రజలకు సముద్రాల యొక్క ఆవశ్యకత తెలియాలని జూన్ 8 ప్రపంచ మహా సముద్రాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్నారు మానవులు. కడలిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి జూన్ 8న కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటుండగా బ్రెజిల్ లోని రియో డిజనీరో లో 1992 లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సు లో సముద్రాల పై అవగాహన పెంచాలని నిర్ణయించారు. చివరకు ఐక్యరాజ్యసమితి 2008 జూన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవంను నిర్వహించింది. సముద్రాలు బాగుండాలి జీవులు బాగుండాలి అనేది అంతర్జాతీయ సముద్ర దినోత్సవం యొక్క థీమ్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి