ఇటీవలే ముగిసిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది. కానీ పేలవ ప్రదర్శనతో నిరాశపరచింది అన్న విషయం తెలిసిందే. కనీసం సెమీఫైనల్లో కూడా అడుగు పెట్టకుండానే ఇంటి బాట పట్టింది టీమిండియా. మొదట వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన టీమిండియా ఆ తర్వాత మూడు మ్యాచ్ లలో పుంజుకొని అద్భుతంగా రాణించినప్పటికి కూడా టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు మాత్రం లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఏకంగా దాయాది దేశమైన పాకిస్థాన్ చేతిలో ఓడిపోవడం మాత్రం భారత క్రికెట్ ప్రేక్షకులందరినీ తీవ్రంగా నిరాశపరిచింది. చరిత్రలో ఇప్పటివరకు ఒక్క సారి కూడా పాకిస్థాన్ చేతిలో ఓడిపోని భారత్ మొదటి సారి టి20 వరల్డ్ కప్ లో ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ జట్టు భారత జట్టుపై విజయం సాధించడాన్ని కాంట్రవర్సీ చేసేందుకు ప్రయత్నించారు పాకిస్థాన్ క్రికెటర్లు. అయితే ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ ముగిసినప్పటికీ కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి సంబంధించిన చర్చ మాత్రం ఆగడం లేదు అని చెప్పాలి. టి 20 ప్రపంచకప్లో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా జట్టు పాకిస్థాన్ జట్టుపై ఓడిపోవడం పై స్పందించిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ షాకింగ్ కామెంట్స్ చేయడం కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ జట్టును చూసి మ్యాచ్ కి ముందే భారత ఆటగాళ్లు వణికిపోయారు అంటూ ఇంజమామ్ ఉల్ హక్ వ్యాఖ్యానించాడు.. భారత జట్టు పాకిస్థాన్తో పోటీ పడటానికి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు అనే విషయం ముందే తెలిసిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. మామూలుగా అయితే స్పిన్నర్లకు ఎంతో అద్భుతంగా ఎదుర్కొనే భారత జట్టు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్పిన్నర్లకు వికెట్లు సమర్పించుకోవడం మాత్రంచూస్తే జాలేసింది అంటూ ఇంజమామ్ ఉల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: