పనికిమాలిన బడ్జెట్ అని కేసీఆర్ తిట్టిండు కానీ జగన్ అంత స్పీడులో లేడు కనుక పెద్దగా మాట్లాడలే కానీ తన పార్టీ సభ్యులతో మాత్రం
బాగానే మాట్లాడించాడు..పోనీలేండి ఆ పాటి స్వేచ్ఛ
ఇన్నాళ్లకు జగన్ ఇచ్చాడు. అందుకు కారణం అయిన
నిర్మలా సీతారామన్ అనే ఆర్థిక మంత్రికి
ఓ కృతజ్ఞత ఓ ధన్యవాద అదే మా విజ్ఞత!
సాధారణంగా ఏడ్వలేక నవ్వు అని అంటారు కదా! అదే ఇవాళ మరియు నిన్న కూడా జరిగింది! ఎందుకంటే నిర్మలత్త పద్దు అంత బాగా ఉంది కనుక! ఏ రంగానికీ ఊతం ఇవ్వకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏకైక ధీర వనిత ఆమె అని చెప్పుకోవడం కాస్త కాదు ఇంకెక్కువ ఆనందం కూడా! ఎందుకంటే ఇలాంటి ఆనందాలు మనకు మళ్లీ మళ్లీ రావు. ఏడ్వలేక నవ్వు.. నవ్వలేక ఏడుపు ఏదో ఒకటి అత్త గురించి ఒక్క మాట కూడా అనకుండ్రి! మీ పుణ్యం ఉంటుంది..
కొంచెం ఆగండి కొంచెం జరగండి పాతికేళ్ల భారతం కళ్లెదుటే ఉందండి.మీరేం దిగులు చెందకండి.మీరేం భయం పొందకండి.మీకు తెలియదు ఇప్పుడు బడ్జెట్ ప్రవేశ పెడితే మరో పాతికేళ్లకు వాటి ఫలితాలు మరియు ఫలాలు అందుకోవడం అన్నది సాధ్యం. ఆ విధంగా మీరు కేంద్ర బడ్జెట్ పై ప్రేమ పెంచుకోండి. ఆ విధంగా మీరు మీ మీ ఆదాయాలను పెంచుకోండి. ఇదీ నిర్మలత్త మనకు చెబుతున్న మాట.. అదిగో నవలోకం పోయుండ్రి.. పోయి వచ్చుండ్రి.. టైం మెషీన్ సెట్ చేస్తాండాను వెళ్లి రండి బాసూ! ఆ ఊసేదో ఆ ఊహదో వెళ్లివచ్చాక చెప్పండి బాసూ!
నిన్నటి వేళ కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై జెడ్ స్పీడులో విమర్శలు ప్రతి విమర్శలూ వినిపిస్తున్నాయి మరియు కనిపిస్తున్నాయి.వీటిపై మోడీ మాట్లాడరు. నిర్మలత్త అస్సలు మాట్లాడరు.వాళ్లు ఇచ్చిందేంటో మనకు వచ్చిందేంటో అన్నవి ఇప్పటికీ క్లారిఫికేషన్ లేదు. అయినా కూడా దేశాన్ని నడిపే శక్తులకు ఈ బడ్జెట్ అన్నది అమోఘం మరియు అమృత తుల్యం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి