మనిషి రక్తాన్ని ఎలుకకు ఎక్కించి సరికొత్త రీతిలో రీసెర్చ్ చేశారు పరిశోధకులు. యువకుల రక్తంలోని ప్లాస్మాను ముసలి ఎలుకలకు ఎక్కించిన తరువాత... అవి ఎంతో యాక్టీవ్-గా మారాయని వెల్లడించారు. ఇంతే కాదు, వాటి ఆలోచన శక్తి కూడా పెరిగిపోయిందని కనిపెట్టారు. మొత్తం ఈ ప్రయోగం ద్వారా యువకుల రక్తంలో ఏదో ఉత్తేజకర విషయం ఉందని వెల్లడించారు.