స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు.. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు నాణ్యమైన బోధన అందించేలా మానవ వనరులను తీర్చిదిద్దేందుకు ఉద్దేశించినవి...దేశవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను అందిస్తున్నప్పటికీ... మైసూరులోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (ఏఐఐఎస్‌హెచ్) మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. తాజాగా 2018-19 సంవత్సరానికి ఏఐఐఎస్‌హెచ్ ప్రవేశ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో ఆయా కోర్సుల వివరాలు, ప్రవేశ ప్రక్రియ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం..

Image result for all india institute of speech and hearing entrance exam 2018
ఏఐఐఎస్‌హెచ్.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1966లో ఏర్పాటైన అటానమస్ ఇన్‌స్టిట్యూట్. ప్రస్తుతం ఇక్కడ డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్నిటికి ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు ఖరారు చేస్తుండగా.. నిర్దేశిత అర్హత పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా మరికొన్ని కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి బోధన, పరిశోధన, ఎన్‌జీఓ విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి.

ప్రవేశ పరీక్షతో కోర్సులు..
బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ: 
వ్యవధి:    నాలుగేళ్లు.
సీట్ల సంఖ్య:  62.
అర్హత:   ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఇంటర్/10+2 స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీల్లో ఏవైనా మూడు సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాలి. జనరల్ అభ్యర్థులు 50 శాతం; ఎస్సీ/ ఎస్టీలు 45 శాతం మార్కులు పొంది ఉండాలి. జాతీయ స్థాయి ఎంట్రెన్‌‌స టెస్ట్ ద్వారా ప్రవేశాలు ఖరారు చేస్తారు. 

ఎంఎస్సీ-ఆడియాలజీ :
వ్యవధి: రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు).
సీట్ల సంఖ్య:  36.
అర్హత:   కనీసం 50 శాతం మార్కులతో బీఎస్సీ (స్పీచ్ అండ్ హియరింగ్) లేదా బీఏఎస్‌ఎల్‌పీ ఉత్తీర్ణత. ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. 

ఎంఎస్సీ (స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీ) :
వ్యవధి:  రెండేళు (నాలుగు సెమిస్టర్లు).
సీట్ల సంఖ్య:  36. 
అర్హత:  కనీసం 50 శాతం మార్కులతో బీఎస్సీ (స్పీచ్ అండ్ హియరింగ్) లేదా బీఏఎస్‌ఎల్‌పీ ఉత్తీర్ణత. ఎంట్రన్స్ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఖరారు చేస్తారు. 

ఎంఈడీ-స్పెషల్ ఎడ్యుకేషన్ : 
వ్యవధి:  రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు).
సీట్ల సంఖ్య:  20 
అర్హత:  బీఈడీ (హియరింగ్ ఇంపెయిర్డ్)/బ్యాచిలర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపెయిర్‌మెంట్)/ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపెయిర్‌మెంట్) ఉత్తీర్ణత. జనరల్ అభ్యర్థులు 50 శాతం; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు పొంది ఉండాలి. జూలై 1 నాటికి 35 ఏళ్లకు మించరాదు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. 

పీహెచ్‌డీ - ఆడియాలజీ :
వ్యవధి:  మూడేళ్లు 
సీట్ల సంఖ్య:  4 (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్).
అర్హత:  కనీసం 55 శాతం మార్కులతో ఎంఎస్సీ (స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ)/ఎంఎస్సీ(ఆడియాలజీ)/ఎంఎస్సీ (స్పీచ్ అండ్ హియరింగ్) ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం ఉత్తీర్ణత ఉండాలి. ఏడాది అనుభవంతో ఎంఏఎస్‌ఎల్‌పీ ఉండాలి. మైసూర్ యూనివర్సిటీ నిర్విహించే పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. 

పీహెచ్‌డీ (స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీ) :
వ్యవధి:  మూడేళ్లు. 
సీట్ల సంఖ్య: 4 (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్)
అర్హత:  జనరల్ అభ్యర్థులు 55 శాతం; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం కనీస మార్కులతో ఎంఎస్సీ (స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ)/ ఎంఎస్సీ (ఆడియాలజీ)/ఎంఎస్సీ (స్పీచ్ అండ్ హియరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవంతో ఎంఏఎస్‌ఎల్‌పీ తప్పనిసరి. మైసూర్‌యూనివర్సిటీ నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. 

పీహెచ్‌డీ (స్పీచ్ అండ్ హియరింగ్) :
వ్యవధి: మూడేళ్లు. 
అర్హత:  జనరల్ అభ్యర్థులు 55 శాతం; ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులు 50 శాతం కనీస మార్కులతో ఎంఎస్సీ (స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ)/ఎంఎస్సీ (ఆడియాలజీ)/ఎంఎస్సీ (స్పీచ్ అండ్ హియరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవంతో ఎంఏఎస్‌ఎల్‌పీ ఉండాలి. మైసూర్ యూనివర్సిటీ నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. 

నేరుగా ప్రవేశాలు లభించే కోర్సులు..
సంబంధిత అకడమిక్ కోర్సులో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని వచ్చిన దరఖాస్తుల నుంచి మెరిట్ జాబితా రూపొందిస్తారు. దీని ఆధారంగా వివిధ కోర్సుల్లో నేరుగా ప్రవేశం కల్పిస్తారు. బ్యాచిలర్ డిగ్రీ, ఇంటర్మీడియెట్ తదితర అర్హతలతో ఈ కోర్సులో ప్రవేశించొచ్చు.

కోర్సుల వివరాలు..

బీఈడీ-స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపెయిర్‌మెంట్).

డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ అండ్ ఇయర్ మౌల్డ్ టెక్నాలజీ.

డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపెయిర్‌మెంట్).

డిప్లామా ఇన్ హియరింగ్, లాంగ్వేజ్, అండ్ స్పీచ్.

పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ లింగ్విస్టిక్స్ ఫర్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ.

పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ స్పీచ్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ.

పీజీ డిప్లొమా ఇన్ ఆగ్మెంటేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్.

పీజీ డిప్లొమా ఇన్ న్యూరో-ఆడియాలజీ.

పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్.


పదో తరగతి ఉత్తీర్ణతతో..
ఏఐఐఎస్‌హెచ్‌లో పదో తరగతి ఉత్తీర్ణతతోనూ అడుగుపెట్టొచ్చు. వీరికి ‘కేర్ గివర్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డెవలప్‌మెంటల్ డిజేబిలిటీస్’ అనే సర్టిఫికెట్ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సు వ్యవధి 14 వారాలు; ఇందులో మొత్తం 20 మందికి అవకాశం కలిస్తారు. 

ముఖ్య తేదీలు: 
దరఖాస్తు విధానం: ఎంట్రన్స్ టెస్ట్‌తో ప్రవేశాలు కల్పించే కోర్సులకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తుకు చివరి తేదీ:  మే 2, 2018. 
ప్రవేశ పరీక్ష తేదీ:  మే 26, 2018.

అకడమిక్ మెరిట్‌తో ప్రవేశాలు కల్పించే కోర్సులకు ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాన్ని పూర్తిచేసి, ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ చిరునామాకు పంపాలి.


దరఖాస్తు చేరడానికి చివరి తేదీ:  మే 2, 2018

వెబ్‌సైట్:   www.aiishmysore.in 


మరింత సమాచారం తెలుసుకోండి: