ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నిరుద్యోగుల‌కు ఇటీవ‌ల విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ శుభ‌వార్త అందించిన సంగ‌తి తెలిసిందే. విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.  మొత్తం 51 పోస్టులు ఉన్నాయి. డిజైనర్, జూనియర్ సూపర్‌వైజర్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2020 ఏప్రిల్ 7 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. 

 

అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. ఆస‌క్తిక‌ర అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసి ప్రింట్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2020 ఏప్రిల్ 14 సాయంత్రం 5 గంటల్లోగా అప్లికేషన్ ఫామ్ పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.hslvizag.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

 

ఇక మొత్తం 51 ఖాళీలు ఉండగా డిజైనర్ Gr-IV (మెకానికల్)- 10, డిజైనర్ Gr-IV (ఎలక్ట్రికల్)- 03, జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (మెకానికల్)- 07, జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (ఎలక్ట్రికల్)- 09, జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (సివిల్)- 07, ఆఫీస్ అసిస్టెంట్ (సెక్రెటేరియల్) Gr-V- 09, జూనియర్ ఫైర్ ఇన్‌స్పెక్టర్ Gr-IV- 04, డ్రైవర్ Gr V- 02 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు విష‌యానికి వ‌స్తే రూ.200 చ‌ల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు. అలాగే  సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: