ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తుంది. డిసెంబర్ నెలలో చైనా దేశంలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ యావత్తు ప్రపంచం మొత్తాన్ని తీవ్ర స్థాయిలో వణికిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారి దాదాపు ముప్పై ల‌క్ష‌ల మందికి సోకింది. మ‌రియు రెండు ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌జ‌లు క‌రోనా కాటుకు బ‌లైపోయారు. ముఖ్యంగా ఆగ్ర‌రాజ్యం అమెరికాలో వైరస్‌ బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. మరోవైపు, వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సడలింపు ప్రక్రియ ఊపందుకుంటోంది. అయితే క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్పకూలాయి. మ‌రోవైపు అప్పుల భారం త‌ట్టుకోలేక కొన్ని కంపెనీలు మూత‌ప‌డ్డాయి. 

 

దీంతో ఉద్యోగులు కాస్త నిరుద్యోగులుగా మారారు. దీంతో కుటుంబాన్ని పోషించ‌డం కూడా భారంగా మారింది. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 55 సైంటిస్ట్ / ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్-SAC కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.  ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, టెక్నీషియన్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. 

 

ఇక మొత్తం ఖాళీలు 55 ఉండగా అందులో సైంటిస్ట్ / ఇంజనీర్- 21, టెక్నికల్ అసిస్టెంట్- 6, టెక్నీషియన్ బీ - 28 (ఫిట్టర్-6, మెషినిస్ట్-3, ఎలక్ట్రానిక్స్-10, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2, ప్లంబర్-1, కార్పెంటర్-1, ఎలక్ట్రీషియన్-1, మెకానికల్-3, కెమికల్-1 పోస్టులున్నాయి. విద్యార్హతల విష‌యానికి వ‌స్తే.. సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ, ఎంఎస్సీ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ లేదా ఎంటెక్. 

 

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. టెక్నీషియన్ బీ పోస్టులకు 10వ తరగతి, ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. 2020 మే 1 ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది. అంటే నాలుగు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. కాబ‌ట్టి.. అర్హులు ఎవ‌రైనా ఉంటే ద‌ర‌ఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://recruitment.sac.gov.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: