కంటికి క‌నిపించ‌ని క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచ‌దేశాలు గ‌డ‌గ‌డ‌లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పురుడుపోసుకున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. అన‌తి కాలంలోనే ప్ర‌పంచ‌దేశాలు విస్త‌రించి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ఉపాధి కోల్పోతున్న ఉద్యోగుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో భారత ప్రభుత్వ పరిధిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌(టీఎంసీ)కి చెందిన ముంబయిలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్ ఉద్యోగాలు భ‌ర్తీ చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేసింది.

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 125 పోస్టులు ఉన్నాయి. వీటి పూర్తి వివ‌రాలు చూస్తే.. మొత్తం 125 ఖాళీల్లో అసిస్టెంట్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌–01, నర్సు–115, క్లినికల్‌ కోఆర్డినేటర్‌ (న్యూరో సర్జరీ)– 01, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–01, టెక్నీషియన్‌–06 మ‌రియు అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌–01 పోస్టులు ఉన్నాయి. విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే.. పోస్టును బట్టి 12వ తరగతి/డిప్లొమా, బీఎస్సీ/ఎంఎస్సీ(నర్సింగ్‌), జీఎన్‌ఎం ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాల‌ని టాటా మెమోరియల్‌ సెంటర్ నోటిఫికేష‌న్‌లో పేర్కొంది.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థు‌ల వ‌య‌స్సు 25-40 ఏళ్ల మధ్య ఉండాలి.  రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టుల‌కు ఎంపిక విధానం ఉంటుంది. జీతం  పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే.. రూ.300 ద‌ర‌ఖాస్తు ఫీజు చ‌ల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారికి ఫీజులు లేదు. అలాగే మహిళలు, పీహెచ్‌సీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్లు కూడా ఎలాంటి ఫీజు చ‌ల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం అయింది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఆగస్టు12, 2020 చివ‌రి తేదీగా టాటా మెమోరియల్‌ సెంటర్కి చెందిన ముంబయిలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్ నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.  ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల కోసం టాటా మెమోరియల్‌ సెంటర్ అధికారిక వెబ్‌సైట్  https://tmc.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: