ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను తీవ్ర స్థాయిలో వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అన్ని దేశాలు అల్ల‌క‌ల్లోలం అయిపోతున్నాయి. భారీ ప్రాణ‌న‌ష్టంతో పాటు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎన్నో కంపెనీలు మూత‌ప‌డ్డాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది.

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. స్పెషలిస్ట్ కన్సల్టెంట్ పోస్టుల్ని ఈ నోటిఫికేష‌న్ ద్వారా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ భర్తీ చేస్తోంది. పోస్టుల పూర్తి వివ‌రాలు చూస్తే.. మొత్తం 13 ఖాళీల్లో ప్రాజెక్ట్ మేనేజర్ (అప్లికేషన్ మేనేజ్‌మెంట్)- 1, సీనియర్ అనలిస్ట్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్)- 1, సీనియర్ అనలిస్ట్ (నెట్వర్క్ / SDWAN ఆపరేషన్స్ )- 1, ప్రాజెక్ట్ మేనేజర్ (ఐటీ ఆపరేషన్స్ / ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్)- 1, అనలిస్ట్ కమ్ చీఫ్ డేటా కన్సల్టెంట్- 1, సైబర్ సెక్యూరిటీ మేనేజర్- 1, అడిషనల్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్- 1, అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్- 2 మ‌రియు రిస్క్ మేనేజర్- 4 పోస్టులు ఉన్నాయి.

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివ‌రాలు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లో తెలుసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు రూ.800 ఫీజు చ‌ల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మాత్రం రూ.50 చ‌ల్లిస్తే స‌రిపోతుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం అయింది. అప్లై చేసేందుకు 2020 ఆగస్ట్ 23 చివ‌రి తేదీగా నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుల‌కు ఎంపిక  చేస్తారు. కాగా,  ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nabard.org/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.

మరింత సమాచారం తెలుసుకోండి: