ఈ పథకంతో తమ క్యాంపస్‌లోని విద్యర్థులు పార్ట్‌టైం ఉద్యోగాల కోసం బయట వెతుక్కుంటూ ఉంటారని, అయితే వారి ఇబ్బందులను తొలగించి, కనీస వేతనంతో వారికి క్యాంపస్‌లోనే ఉద్యోగాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. దీనికోసమే కర్మయోగి పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపింది. దీనికి సంబంధించి లక్నో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అలోక్ కుమార్ రాయ్ మాట్లాడుతూ, కర్మయోగి పథకం ద్వారా ఒక విద్యార్థి సంవత్సరంలో గరిష్ఠంగా రూ.15వేల వరకు సంపాదించవచ్చని వెల్లడించారు. తరగతుల తర్వాత రోజుకు గంట సమయం పాటు ప్రతి విద్యార్థి ఈ పార్ట్ టైమ్ ఉద్యోగం చేయవచ్చని, దీనికోసం యూనివర్సిటీనుంచి విద్యార్థులందరికీ అనుమతులు ఇవ్వనున్నామని తెలిపారు.
ప్రతి విద్యార్థికి 50రోజుల్లో 50 గంటలపాటు పనిచేసేందుకు అనుమతిస్తామని, తరగతి తర్వాత పార్ట్ టైమ్ జాబ్ చేసే విద్యార్థికి గంటకు 150 రూపాయలు చొప్పున చెల్లించనున్నామని ఆయన తెలిపారు. ప్రస్థుతం లక్నో యూనివర్శిటీ క్యాంపస్‌లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ పార్ట్ టైమ్ జాబ్ చేసే సౌకర్యాన్ని కల్పించామని, అయితే మరి కొంత కాలంలో యూనివర్శిటీ అనుబంధ కళాశాలల్లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టేవిధంగా తాము ప్రయత్నాలు చేస్తామని వీసీ చెప్పారు. విద్యార్థులకు పనిచేయడం నేర్పడంతోపాటు వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకే ఈ పార్ట్ టైమ్ ఉద్యోగాల పథకాన్ని ప్రవేశపెట్టామని, ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తాము నమ్ముతున్నామని వీసీ రాయ్ పేర్కొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి