నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది . నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్త మోసుకొచ్చింది . ఇక ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం సాధించాలని అనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ ఒక్క గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా సంతోషపడాల్సిన విషయమే. అందులో నిరుద్యోగులు కరోనా టైం లో ఉద్యోగం లేక ఉద్యోగం వున్న వారు ఆ ఉద్యోగం కోల్పోవడం వల్ల దేశంలో ఇంకా నిరుద్యోగులు సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఎంతోమంది నిరుద్యోగ సమస్యతో నిరాశ్రియులు అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి వారి కోసమే ఒక శుభవార్త.
అందుకోసం( బిఓఎంఎల్ ) భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ భారీ నియామకాలను చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది.అర్హత,ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు. ఫిబ్రవరి 15 వ తేదీని దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించారు.మరింత సమాచారం కోసంhttps://www.bharatiyapashupalan.com/ అధికార వెబ్సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు పోస్టుల సంఖ్య :3216
సేల్స్ మేనేజర్-64,
సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ -485,
సేల్స్ హెల్పర్ -2667
అర్హత : సేల్స్ మేనేజర్ పోస్టులకు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
సేల్స్ డెవలప్మెంట్ పోస్టులకు ఇంటర్,
షేర్స్ హెల్పర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు : సేల్స్ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 45 ఏళ్లు లోపు ఉండాలి.
ఇతర పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఎఫిషియన్సీ టెస్ట్.
ఇందులో అర్హత సాధించిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 15,2021
అధికార వెబ్ సైట్ :https://www.bharatiyapashupalan.com/ ఇంకెందుకు ఆలస్యం ఇక కొద్ది రోజులే ఉంది. వెంటనే అప్లై చేసుకోండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి