వారికి ప్రస్తుతం అందిస్తున్న జీతాల తో పాటుగా రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్న సదుపాయాలను కూడా అందిస్తుంది.తొలి పీఆర్సీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని వర్గాల ఉద్యోగులకు ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, మేలైన సౌకర్యాలు.. వేతనాల మధ్య అంతరాన్ని తగ్గించడం వంటి అనేక కీలక సూచనలను అందించింది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే విధంగానే సదుపాయాలు కల్పించాలి. ఒక్క పెన్షన్ మినహా మిగిలిన అన్ని రకాల సదుపాయలు రెగ్యులర్ ఉద్యోగుల కు ఇచ్చిన విధంగానే వీరికి కల్పించడం వల్ల ఒత్తిడి ఉండదు. మానవ వనరులు సద్వినియోగమవుతాయి..
పార్ట్ టైమ్ లెక్చరర్లు, గెస్ట్ లెక్చరర్లకు ప్రస్తుతం గంటకు రూ.300 నెలకు రూ. 21,600 ఉన్న వేతనాన్ని గంటకు రూ.400.. నెలకు రూ.28,800 కు పెంచాలి.
మినిమమ్ టైమ్ స్కేల్ పార్ట్ టైమ్ లెక్చరర్లకు ప్రస్తుతం రూ.37,100 ప్లస్ డీఏ ఇస్తున్నారు. దీనిని రూ. 54,220 ప్లస్ డీఏ గా ఇచ్చే దిశగా ఆలోచనలు చేస్తుంది. ప్రతి ఒక్క కేటరింగ్ కింద ఉన్న వారికి ఉపయోగపడే విధంగా జీతాలు చేస్తామని తెలిపారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగుల కు సమాన హక్కులు కూడా కల్పించవచ్చు అని భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి