ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించింది..ఇప్పుడు మరో విభాగంలో ఖాళీలను వెల్లడించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ప్రతీ ఏటా వేల సంఖ్యలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకు టెన్త్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకూ టెన్త్ పాస్ అయితే చాలు. వీటితో పాటు టెన్త్ పాస్ అయినవారికి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు ఉంటాయి. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే.


స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 10వ తరగతి పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. ఖాళీల వివరాలను తర్వాత ప్రకటిస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కానీ ఖాళీల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం SSC MTS Recruitment 2021 ఇక్కడ క్లిక్ చేయండి.ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. టెన్త్ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. మొత్తం 1159 ఖాళీలున్నాయి. అందులో 710 పోస్టులు విశాఖపట్నంలోనే ఉన్నాయి. అప్లై చేయడానికి 2021 మార్చి 7 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం indian Navy Recruitment 2021 ఇక్కడ క్లిక్ చేయండి.


ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ సీ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 255 ఖాళీలున్నాయి. అప్లై చేయడానికి 2021 మార్చి 13 చివరి తేదీ. టెన్త్, ఇంటర్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. నోటిఫికేషన్ వివరాల కోసం అధికార వెబ్ సైట్ IAF Group C Recruitment 2021 క్లిక్ చేసి పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకోండి.భారత సాయుధ దళాలకు చెందిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్-BRO ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 459 ఖాళీలున్నాయి. టెన్త్ ఇంటర్ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేయడానికి 2021 ఏప్రిల్ 4 చివరి తేదీ.. ఈ ఉద్యోగ అవకాశాలను తదితర వివరాలను BRO Recruitment 2021 క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు..


ఇవి కాకుండా ఇంకా చాలా విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: