తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే సందేహాలు మొదలయ్యాయి.. అలాంటి విద్యార్థులు అస్సలు భయపడకండి.. ఈ విధంగా ప్రిపేర్ అయితే మంచి మార్కులను సాధిస్తారు అవేంటో చూద్దాం..
పరీక్షలు పెడితే ఎన్ని మార్కులొస్తాయోనన్న కంగారు వదిలేయాలి. ఉన్నత చదువులకు వెళ్లడానికి ఇవి అర్హత పరీక్షల్లాంటివి. కాబట్టి మనసు పెట్టి చదవాలి. మార్కులెన్ని వచ్చినా పర్వాలేదు, వచ్చిందే రాయాలి. చదివిన విషయాల్ని బాగా గుర్తుపెట్టుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..
విరామం లేకుండా చదవడం కూడా మంచిది కాదు. కచ్చితంగా ప్రతి రెండు గంటలకు మధ్య 15 నిమిషాలు విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు చదివినవన్నీ గుర్తుంటాయి. మెదడు అలసటకు గురి కానివ్వదు. తద్వారా ఏకాగ్రత తప్పిపోకుండా ఉంటుంది..
చిన్న సమస్య వచ్చిన మందులు అస్సలు వాడకూడదు..వాటివల్ల పరీక్షలకు ఎఫెక్ట్ పడుతుంది.నీరు అధిక మోతాదులో తీసుకోవాలి. ఓ వైపు కరోనా కాటు, మరోవైపు మాడు పగిలే ఎండలు. ప్రస్తుతం భారీగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఉక్కపోత ఎక్కువ. శరీరంలో తరచూ నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. బలహీన పడకుండా విద్యార్థులు రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలి. ఇలా చేస్తే చురుగ్గా ఉంటారు.
ప్రస్తుతం ఎండలు మండిపడుతున్నాయి. మిడ్ వేసవిలో ఉన్నాం కాబట్టి మాంసాహారం తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయలు తినాలి.. పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇవన్నీ మంచి శక్తినిస్తాయి. నిత్యం ఉల్లాసంగా ఉండటానికే చూడాలి.. పిల్లల పరీక్షల విషయంలో ముందు జాగ్రత్తలు తల్లి దండ్రులు పాటించాలి.. మొబైల్ , టీవీ లను కొద్ది రోజులు పక్కన పెట్టడమే మంచిది.. కరోనా భయం వీడి పరీక్షలను దృష్టిలో ఉంచుకోవాలి.. అప్పుడే ఉతీర్ణత తో పాటుగా మంచి మార్కులను అందుకుంటారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి