ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేయాలనే ఆలోచన లో చాలా మంది ఉంటారు. కొంత మంది అదృష్టం చివరి వరకు వచ్చి తప్పిపోతే, మరి కొంత మంది మాత్రం ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో తెలియక వదిలేస్తారు. అలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పారు. చెన్నైలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్, మెయిల్ మోటార్ సర్వీస్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. టైర్‌ మ్యాన్, కాపర్ అండ్ టిన్‌స్మిత్ లాంటి పోస్టులున్నాయి. గతంలో ఈ ఉద్యోగాల కు ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లు సమాచారం..  ఈ ఏడాది కూడా ఎక్కువ మంది అప్లై చేసుకుంటారని అధికారులు భావిస్తున్నారు..


మొత్తం 10 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు 2021 మే 25న ముగుస్తుందని ముందే ప్రకటించినా, గడువు పొడిగించింది.ఈ ఉద్యోగాల వివరాలు ఇలా.. ఖాళీల వివరాలు చూస్తే ఎంవీ మెకానిక్-5, కాపర్ అండ్ టిన్‌స్మిత్-1, పెయింటర్-1, టైర్‌మ్యాన్-1, ఎంవీ ఎలక్ట్రీషియన్-1 లాంటి పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జూన్ 10 లోగా దరఖాస్తు చేయాలి. అసలు విషయానికొస్తే.. విద్యార్హతల వివరాలు చూస్తే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి 8వ తరగతి లేదా ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు.


8వ తరగతి పాస్ అయినవారు ఏడాది ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. వయస్సు 2020 జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. అభ్యర్థులు పోస్టు లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి స్పీడ్ పోస్టు ద్వారా నోటిఫికేషన్‌ లో తెలిపిన అడ్రస్ కు అప్లై ఫామ్ ను పంపించాలి. ఆసక్తి కలిగిన విద్యార్థులు, నిరుద్యోగు లు ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: