ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది. ఈ సంస్థలో ఉన్న పలు విభాగాలకు సంబంధించిన ఖాళీలకు దరఖాస్తులను కోరుతుంది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ వల్ల చాలా మంది ఉద్యోగాలను పొందారని, ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా చాలా మంది ఉద్యోగాలను పొందుతారని అధికారులు అంటున్నారు. ఇటీవల ఖాళీల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.


స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు విండోను మళ్లీ ఓపెన్ చేసింది. ఫైర్ ఇంజనీర్ల పోస్టుల భర్తీ చేయనుంది. ఇందులో 16 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు జూన్ 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఈ నెల 28న దరఖాస్తుల స్వీకరణ ను ఆపివేస్తారు. అంటే మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. బ్యాంక్ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీ ఒక్కో క్యాటగిరికి ఒక్కోలా ఉంటుంది. జనరల్ వారికి 750 ఉంటె మిగిలిన వారికి మినహాయింపు ఉంటుంది.


ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు ముందుగానే నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. బీఈ, బీటెక్ లలో ఫైర్ సర్వీసుల లో పాస్ అయ్యి ఉండాలి. ఈ పోస్టులకు https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో దరఖాస్తు చేయొచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లను నిర్వహిస్తారు. వాటిలో సక్సెస్ ఆయిన్ వాళ్ళను మాత్రమే ట్రైనింగ్ కు పంపిస్తున్నారు. మీకు ఆసక్తి ఉంటె మీరు కూడా అప్లై చేసుకోవచ్చు.. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయమేంటంటే మరో ఐదు రోజులు మాత్రమే దరఖాస్తులను చేసుకోవడానికి అవకాశం ఉంది.. అటు బీటెక్ అయిన ఇటు బిఎస్సి అయిన కూడా మంచి గుర్తింపు పొందిన విద్యాలయాల్లో చదివి ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: