ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పూణే వారు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ద్వారా ప్రిన్సిపాల్ టెక్నికల్  ఆఫీసర్, సీనియర్ టీచింగ్ అసోసియేట్, టీచింగ్ అసోసియేట్, ఆఫీస్ అసిస్టెంట్, ఫైనాన్స్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు తేదీ : 10, అక్టోబర్ లోపు.

ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న వారి నుండి షాట్ లిస్ట్ చేసిన వారికి ఇమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.

ఉద్యోగాలు : తాత్కాలిక ఉద్యోగాలు

విద్యార్హతలు :

ప్రిన్సిపాల్ టెక్నికల్ ఆఫీసర్(పిటిఓ) - పీహెచ్డీ ఇన్ బయాలజీ మరియు 5ఏళ్ళ ఉపాధ్యాయ అనుభవం;

సీనియర్ టీచింగ్ అసోసియేట్(ఎస్టీయే)-ఎంఎస్సీ మాథ్స్ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా సైన్స్ ఎడ్యుకేషన్ మరియు 5 ఏళ్ళ ఉపాధ్యాయ అనుభవం;

టీచింగ్ అసోసియేట్(టీఏ)-ఎంఎస్సీ మాథ్స్ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా సైన్స్ ఎడ్యుకేషన్ మరియు 2 ఏళ్ళ ఉపాధ్యాయ అనుభవం;

ఆఫీస్ అసిస్టెంట్ - మాస్టర్ డిగ్రీ మరియు 2ఏళ్ళ తత్సమాన అనుభవం;

ఫైనాన్స్ మేనేజర్ : మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ మరియు 5 ఏళ్ళ తత్సమాన అనుభవం;

వయసు అర్హతలు :

ప్రిన్సిపాల్ టెక్నికల్ ఆఫీసర్(పిటిఓ) - 45 ఏళ్ళ లోపు

సీనియర్ టీచింగ్ అసోసియేట్(ఎస్టీయే)-45 ఏళ్ళ లోపు

టీచింగ్ అసోసియేట్(టీఏ)-30 ఏళ్ళ లోపు

ఆఫీస్ అసిస్టెంట్ - 33 ఏళ్ళ లోపు  

ఫైనాన్స్ మేనేజర్ - 40 ఏళ్ళ లోపు

జీతం :

ప్రిన్సిపాల్ టెక్నికల్ ఆఫీసర్(పిటిఓ) : 75000-85000 రూ.

సీనియర్ టీచింగ్ అసోసియేట్(ఎస్టీయే) : 50000-60000 రూ.

టీచింగ్ అసోసియేట్(టీఏ) : 40000-50000 రూ.

ఆఫీస్ అసిస్టెంట్ : 25000-30000 రూ.

ఫైనాన్స్ మేనేజర్ : 40000-50000 రూ.

ఇతర వివరాలకు : http://www.iiserpune.ac.in/ చూడగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: