కరోణ కారణంగా చాలా రోజుల నుంచి విద్యార్థుల చదువులు  ఆగి పోయాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయట పడుతున్న సందర్భంగా  అన్ని  విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. ఇన్ని రోజుల నుంచి  విద్యార్థులకు ఇలాంటి విద్య లేక వెనక పడిపోయారు. అందరు విద్యార్థులను గత సంవత్సర కాలం నుంచి  ఉత్తీర్ణులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం వస్తుంది. కానీ ఈ సంవత్సరం అన్ని విద్యాసంస్థల ప్రారంభం కావడంతో, అన్ని విద్యాసంస్థల్లో పరీక్షలు అనేవి నిర్వహించాలనే ది  నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని అనుకున్నారు.  దీంతో  తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 25 నుంచి  ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయాలన్న పిటిషన్ పై ఈరోజు హైకోర్టు తీర్పు నిచ్చింది. ఇంటర్ బోర్డు పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ఇంకా ఉందని, దాని వల్ల ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయంటూ పిటిషన్ దాఖలైంది.

 దానిపై పూర్తి విచారణ చేసినటువంటి న్యాయస్థానం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పరీక్షలు ఆపలేమని యధావిధిగా  పరీక్షలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఇప్పటికే ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మంచి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామంటూ న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ కొంత ఆలస్యంగా వేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా న్యాయస్థానం పేర్కొంది. దాదాపు నాలుగు లక్షలకు పైచిలుకు విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా సబితా ఇంద్రారెడ్డి పూర్తి చేశామంటూ  పేర్కొన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎవరైనా తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ లు  అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని  విద్యాశాఖ కోరుతూ వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: